SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ కల్పిత కథ.. చరిత్ర పాఠం కాదు..

ABN , First Publish Date - 2022-09-22T01:36:37+05:30 IST

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ కల్పిత కథ.. చరిత్ర పాఠం కాదు..

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన  సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న నాటి నుంచి ఈ సినిమాపై వెస్ట్రన్ ఆడియన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ, కొంత మంది మాత్రం బ్రిటిషర్స్‌ను విలన్స్‌గా చూపించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విమర్శలకు రాజమౌళి సమాధానమిచ్చాడు.  


‘ఆర్ఆర్ఆర్’ సంచలన విజయం సాధించడంతో రాజమౌళిని అనేక దేశాలు ఆహ్వానిస్తున్నాయి. సినిమా గురించి మాట్లాడాలని కోరుతున్నాయి. తాజాగా యూఎస్ఏ‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్ జరిగింది. అనంతరం క్వశ్యన్ అన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విమర్శలకు జక్కన్న సమాధానమిచ్చాడు. ‘‘సినిమా ప్రారంభంలోనే ఘటనలంతా కల్పితం అని చెప్పాం. ఒకవేళ మీరు మిస్ అయ్యుండొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ కల్పిత కథ. చరిత్ర పాఠం కాదు. సామాన్య ప్రేక్షకులకు అది అర్థం అవుతుంది. ఒక బ్రిటిష‌ర్‌ను విలన్‌గా చూపించినంత మాత్రాన అందరు బ్రిటిషర్స్ విలన్స్ అని కాదు. ‘ఆర్ఆర్ఆర్’ లో ఒకరు హీరో, మరొకరు విలన్. అది అందరు అర్థం చేసుకుంటారు. స్టోరీ టెల్లర్‌గా మనం ఇవి అర్థం చేసుకుంటే ఇతర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని యస్‌యస్. రాజమౌళి చెప్పాడు. 


‘ఆర్ఆర్ఆర్’ త్వరలో జపాన్‌లో విడుదల కాబోతుంది. త్వరలోనే చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేయనుందని సమాచారం. ఈ చిత్రం జపాన్‌లో అక్టోబరు 21న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్’ ను విజువల్ వండర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. 1920ల నేపథ్యంలో చిత్రం కొనసాగుతుంది. లక్ష్య సాధన కోసం ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా పోరాడారు.. ఈ పోరాటంలో వారికీ ఏ విధమైన సవాళ్లు ఎదురయ్యాయి..వాటిని ఏవిధంగా అధిగమించారనేది చిత్ర సారాంశం.

Updated Date - 2022-09-22T01:36:37+05:30 IST