SS Rajamouli: నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహంతో ఉన్నానంటున్న రాజమౌళి

ABN , First Publish Date - 2022-07-31T22:36:26+05:30 IST

దర్శకధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా

SS Rajamouli: నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహంతో ఉన్నానంటున్న రాజమౌళి

దర్శకధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్ (Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచింది.  రూ.1200కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ మే 20నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ సినిమాను విదేశీ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. అయినప్పటికీ, రాజమౌళి నెట్‌ఫ్లిక్స్ మీద ఆగ్రహంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. అందుకు కారణమేంటంటే..   


‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ వెర్షన్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంటే, ఇతర భాషల హక్కులు ‘జీ-5’, ‘డిస్నీ+హాట్ స్టార్’ దగ్గర ఉన్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రుస్సో బ్రదర్స్, రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ కు విదేశీ ప్రేక్షకుల నుంచి లభించిన ప్రశంసలు చూసి సర్‌ప్రైజ్‌కు లోనయ్యానని రాజమౌళి చెప్పాడు. హిందీ వెర్షన్ హక్కులను మాత్రమే నెట్‌ఫ్లిక్స్ తీసుకుందని, మిగిలిన నాలుగు భాషల హక్కులను తీసుకోకపోవడంతో ప్లాట్‌ఫాంపై ఆగ్రహంతో ఉన్నట్టు పేర్కొన్నాడు. ‘‘ఓ మంచి కథ ప్రతి ఒక్కరికీ మంచి కథే. కానీ, విదేశీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా నేను సినిమాలు తీస్తానని అనుకోలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్ట్రీమింగ్ మొదలు కాగానే అందరు చూడటం ప్రారంభించారు. విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. విదేశీ ప్రేక్షకులకు సినిమా నచ్చడం చూసి నేను సర్‌ప్రైజ్ అయ్యాను. కానీ, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రావడం వల్లే ఎక్కువ మంది చూశారు. అందుకు నెట్‌ఫ్లిక్స్‌కు రుణపడి ఉంటాను’’ అని రాజమౌళి చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్‌గా ‘ఆర్ఆర్ఆర్’ 10వారాల పాటు ట్రెండ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 47మిలియన్ గంటల పాటు ఈ చిత్రాన్ని వీక్షించారు. 

Updated Date - 2022-07-31T22:36:26+05:30 IST