మహమ్మారి పరార్ : 'The Kashmir Files' జోరును... బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తోన్న ‘RRR’ జోష్!

ABN , First Publish Date - 2022-04-06T03:50:06+05:30 IST

కరోనా కాలంలో ఇక థియేటర్స్ వ్యవస్థ పని అయిపోయినట్టే అని చాలా మంది భావించారు. కానీ, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ లాంటి తక్కువ బడ్జెట్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 300 కోట్లు సాధించటం, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ బొనాంజా వెయ్యి కోట్లు ఒడిసిపట్టబోతుండటం... ఏ విధంగా చూసినా శుభసూచకమే!

మహమ్మారి పరార్ : 'The Kashmir Files' జోరును... బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తోన్న ‘RRR’ జోష్!

ఎప్పుడొస్తుందా అని ఏళ్ల తరబడి ఎదురు చూసిన ‘ఆర్ఆర్ఆర్’ రానే వచ్చింది. అప్పుడే పది రోజులు పూర్తయ్యాయి కూడా. అయితే, 11వ రోజు కూడా రాజమౌళి స్పెక్టాక్యులర్ యాక్షన్ థ్రిల్లర్ తన జోరు కొనసాగిస్తూనే ఉంది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ లెటెస్ట్ ట్వీట్ ప్రకారం కేవలం హిందీ వర్షన్ ‘ఆర్ఆర్ఆర్’కి 200 కోట్లు ఖాతాలో పడబోతున్నాయట. సెకండ్ వీకెండ్ కాలంలో శుక్రవారం 13.50 కోట్లు, శనివారం 18 కోట్లు, ఆదివారం 20.50 కోట్లు కొల్లగొట్టింది హిందీ ‘ఆర్ఆర్ఆర్’. రెండో వారం మొదటి రోజైన సోమవారం వేళ 7 కోట్లు సాధించింది పీరియాడికల్ మూవీ. దాంతో ఇంత వరకూ 191.59 కోట్లు వసూలు చేసినట్టైంది. అయితే, రామ్ చరణ్, ఎన్టీఆర్ స్టారర్ అతి త్వరలో అక్షయ్ కుమార్ మూవీ ‘సూర్యవంశీ’ లైఫ్ టైం కలెక్షన్స్‌ని దాటేయనుందట. అక్షయ్ కుమార్, కత్రీనా స్టారర్ కాప్ డ్రామా థియేటర్స్ నుంచీ తప్పుకునే సమయానికి 196 కోట్లు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని ఒకట్రెండు రోజుల్లో రాబట్టబోతోన్న హిందీ ‘ఆర్ఆర్ఆర్’ 200 కోట్ల మైలురాయికి దగ్గరగా వచ్చేస్తోంది!


ఏక కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్‌లో దుమ్మురేపుతోంది. అయితే, మిగతా భాషల్లోనూ, ప్రపంచ వ్యాప్తంగా కూడా సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా ‘ఆర్ఆర్ఆర్’ టోటల్ కలెక్షన్స్ 900 కోట్ల ఫిగర్‌ని దాటేశాయి. వెయ్యి కోట్ల క్లబ్ దిశగా చెర్రీ, తారక్ పరుగులు తీస్తున్నారు. అయితే, మహమ్మారి తరువాత భారతీయ బాక్సాఫీస్‌కి... మరీ ముఖ్యంగా, బాలీవుడ్ టికెట్ కౌంటర్స్‌కి... కొత్త జోష్ తీసుకొచ్చింది ‘ఆర్ఆర్ఆర్’. కరోనా కల్లోలం కారణంగా కకావికలం అయిన థియేటర్స్‌కి రాజమౌళి మాస్టర్‌పీస్ జనాల్ని పరుగులు పెట్టించింది. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే ‘ద కాశ్మీర్ ఫైల్స్’ 200 కోట్ల వసూళ్లు రాబట్టి బాలీవుడ్‌లో ఉత్సాహాన్ని నింపింది. దాన్ని కొనసాగిస్తూ ఇఫ్పుడు ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ వర్షన్ కూడా పోస్ట్ ప్యాండమిక్ ఎరాలో 200 కోట్లు సాధించిన చిత్రంగా నిలవబోతోంది. 


కరోనా కాలంలో ఇక థియేటర్స్ వ్యవస్థ పని అయిపోయినట్టే అని చాలా మంది భావించారు. కానీ, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ లాంటి తక్కువ బడ్జెట్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 300 కోట్లు సాధించటం, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ బొనాంజా వెయ్యి కోట్లు ఒడిసిపట్టబోతుండటం... ఏ విధంగా చూసినా శుభసూచకమే!  

Updated Date - 2022-04-06T03:50:06+05:30 IST