పునీత్‌ నివాసానికి రాజమౌళి

ABN , First Publish Date - 2021-11-27T18:44:09+05:30 IST

ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బెంగళూరులో పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ నివాసానికి వెళ్లారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కన్నడ పాట ప్రి-రిలీజ్‌లో పాల్గొనేందుకు బృందంతో కలసి రాజమౌ

పునీత్‌ నివాసానికి రాజమౌళి

బెంగళూరు: ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బెంగళూరులో పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ నివాసానికి వెళ్లారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కన్నడ పాట ప్రి-రిలీజ్‌లో పాల్గొనేందుకు బృందంతో కలసి రాజమౌళి శుక్రవారం బెంగళూరుకు వచ్చారు. కార్యక్రమం ముగిశాక సదాశివనగర్‌లోని పునీత్‌ నివాసానికి రాజమౌళితోపాటు కీరవాణి వెళ్లారు. పునీత్‌ భార్య అశ్వినిని పరామర్శించారు. అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ పునీత్‌ను రెండుసార్లు కలిశానని, కుటుంబ సభ్యుడిలా అభిమానం అప్యాయత చూపారన్నారు. ఎంతోమందికి పునీత్‌ సాయం చేసేవారని గుర్తు తెచ్చుకున్నారన్నారు. భార్య రమాతోపాటు పలువురు ఉన్నారు. 

Updated Date - 2021-11-27T18:44:09+05:30 IST