Adipurush: టీజర్‌పై రాజమౌళి అన్నయ్య వ్యంగ్యాస్త్రాలు!

ABN , First Publish Date - 2022-10-03T21:21:06+05:30 IST

ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ టీజర్‌ను ఆదివారం అయోధ్యలో విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌ కొందరిని ఆకట్టుకుంటే మరికొందరిని నిరుత్సాహ పరచింది.

Adipurush: టీజర్‌పై రాజమౌళి అన్నయ్య వ్యంగ్యాస్త్రాలు!

ప్రభాస్‌ (Prabhas) రాముడిగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush trolling)టీజర్‌ను ఆదివారం అయోధ్యలో విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌ కొందరిని ఆకట్టుకుంటే మరికొందరిని నిరుత్సాహ పరచింది. అభిమానుల్లో కొందరు రోమాలు నిక్కబోడుచుకున్నాయని అంటుంటే మరి కొందరు కార్టూన్లతో సినిమా చేశారేంటి? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ నెటిజన్లు, అభిమానులే ఈ టీజర్‌ మీద కామెంట్‌ చేశారు. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ‘ఆదిపురుష్‌’ టీజర్‌ను కామెంట్‌ చేసే జాబితాలో చేరారు. టీజర్‌ విడుదలైన రెండు గంటల తర్వాత రాజమౌళి సోదరుడు నటుడు, రచయిత ఎస్‌.ఎస్‌.కాంచీ ఈ విషయం మీద ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ‘పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి’ అంటూ కామెంట్‌ చేశారు. అయితే కాంచీ ఎక్కడా పేరును ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడాయన ట్వీట్‌కు పలువురు భిన్నంగా స్పందించారు. (S.S,Kanchi comments on Adipurush)


ఓ నెటిజన్‌ కాంచీకి కౌంటర్‌ ఇచ్చారు. ‘‘సీతా కల్యాణం లాంటి సినిమాలు మినహా, తెలుగు సినిమా పురాణాలకు చేసినంత డామేజ్‌ బహుశా వేరే వాళ్ళు ఎవరూ చేయలేదేమో! తీసేవాళ్లకి కావలసినట్లు పురాణాలను మార్చేసుకుంటారు’’ అని ఓ నెటిజన్‌ కాంచీకి కౌంటర్‌ ఇచ్చారు. దానికి ‘మీరు ఇంకా బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లోనే ఉన్నారేమో నేను గ్రే రోజుల్లో బతుకుతున్నానని చెప్పుకొచ్చారు కాంచీ. 


మరొక నెటిజెన్‌ ‘హిందీలో వచ్చిన మహాభారతం, రామాయణం కొన్నేళ్ల క్రితమే భారతదేశం మొత్తం మళ్లీమళ్లీ చూేసలా తీశారు కదండీ! అదేంటో మరి హిందీ వాళ్ళు తీసినా ఇప్పటికీ తెగ చూస్తూనే ఉంటారు మన తెలుగు వాళ్ళతో సహా’ అంటూ కౌంటర్‌ ఇవ్వడంతో ‘వేరే వాళ్ళు తీేస్త చూడరని, చూడలేదని అర్థం వచ్చేలా నా ప్రకటన ఉందా అండీ అంటూ అమాయకంగా ప్రశ్నించారు ఎస్‌.ఎస్‌.కాంచీ. అయితే ‘ఆదిపురుష్‌’ను తీసింది హిందీ దర్శకుడే అయినా అందులో నటించింది తెలుగు హీరో! ‘మీ ఫ్యామిలీ తీసిన ‘బాహుబలి’ సినిమాలో కథానాయకుడిగా నటించాడని మరచిపోకండి కాంచీ’ అంటూ మరో నెటిజన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. 


అంతే కాదు అంతకుమందు ‘పన్నీర్‌ సెల్వం’ అంటూ మరో వ్యంగ్యమైన ట్వీట్‌ చేశారు కాంచీ. ‘‘పొరపాటున  నా కొలీగ్‌ ఒకాయన ఇటీవల ‘పన్నీర్‌  సెల్వం’ చూశాను అని చెప్పగానే పక్కనే ఉన్న తమిళ కొలీగ్‌ అయిదవ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం చేశాడు’’ అని కాంచీ ట్వీట్‌ చేశారు. అంతే కాదు.  ‘భశుం’ ఇంత కంగాళీ సినిమా నా జన్మలో చూడలేదు. అప్పుడెప్పుడో చదివిన బాపూ గారి కార్టూను’’ అంటూ మరో ట్వీట్‌ చేయడంతో ఆయన కామెంట్‌ చేసింది పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా గురించేనా అన్న చర్చ జరుగుతోంది. 




Updated Date - 2022-10-03T21:21:06+05:30 IST