OTT ప్రపంచంలో... ఏదేదో జరగబోతోందంటోన్న SRK!

ABN , First Publish Date - 2022-03-16T00:41:13+05:30 IST

వ్యాపారం అంటే వినోదం కాకపోవచ్చు... కానీ, వినోదం మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే! ఇండియన్ ఎంర్టైన్మెంట్ ఇప్పుడు వందల కోట్ల వ్యవహారం! అందుకే, పరిశ్రమలోని వారు, బయటి వారు కూడా ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న షారుఖ్‌కి ఏం తక్కువా?

OTT ప్రపంచంలో... ఏదేదో జరగబోతోందంటోన్న SRK!

వ్యాపారం అంటే వినోదం కాకపోవచ్చు... కానీ, వినోదం మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే! ఇండియన్ ఎంర్టైన్మెంట్ ఇప్పుడు వందల కోట్ల వ్యవహారం! అందుకే, పరిశ్రమలోని వారు, బయటి వారు కూడా ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న షారుఖ్‌కి ఏం తక్కువా? కింగ్ ఖాన్ కూడా షో బిజ్‌లో తన పేరు, పలుకుబడి ఉపయోగించుకోవచ్చుగా? అదే చేస్తానంటున్నాడు బాద్షా... 


హిందీ తెరపై సంవత్సరాలుగా తిరుగులేని స్టార్‌డమ్ కొనసాగిస్తోన్న షారుఖ్ మంచి బిజినెస్‌మ్యాన్ కూడా. నటనే కాదు రియల్ లైఫ్‌లో లాభనష్టాల లెక్కలు కూడా బాగానే బేరీజు వేస్తుంటాడు. అందుకు ఉదాహరణలే ‘రెడ్‌ చిల్లీస్’, ‘కోల్‌కతా నైట్ రైడర్స్’. ఒకటి ప్రొడక్షన్ హౌజ్, మరొకటి ఐపీఎల్ ఫ్రాంఛైజీ. రెండు వ్యాపారాల్నీ విజయవంతంగా నడుపుతున్నాడు బాలీవుడ్ బాద్షా. అయితే, తాజాగా మరో ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్‌లోకి కాలుపెట్టబోతున్నాడట. ఓటీటీ రంగంలో కింగ్ ఖాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.


షారుఖ్ లెటెస్ట్ ట్వీట్ ప్రస్తుతం చర్చగా మారింది. ‘ఎస్ఆర్కే+’ కమింగ్ సూన్... అంటూ ఓ పిక్ పోస్ట్ చేశాడు. అంతే కాదు ‘‘కుచ్ కుచ్ హోనే వాలా హై, ఓటీటీ కీ దునియా మే’’ అంటూ క్యాప్షన్ కూడా రాశాడు! ఇంకా ఇతర వివరాలేవీ బయటకు రాలేదుగానీ, ‘ఎస్ఆర్కే+’ అనే ఓటీటీ అయితే వస్తోందని మనం భావించవచ్చు. అది పూర్తిగా ఎస్ఆర్కేదేనా? లేక మరెవరితోనైనా పార్ట్‌నర్‌షిప్ ఉంటుందా? ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే అన్ని వివరాలు బయటకు రావచ్చు. గతంలో ‘డిస్నీ+ హాట్‌స్టార్’తో బాలీవుడ్ బాద్షా చేతులు కలుపుతాడని వార్తలొచ్చాయి. దానికి, ఇప్పుడు ప్రకటించిన ‘ఎస్ఆర్కే+’కి సంబంధం ఉందా... లేదా... అనేది తెలియదు. స్వంతంగా తానే ఓటీటీని లాంచ్ చేస్తే మాత్రం ‘పఠాన్’ స్టార్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే లెక్క! అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి దిగ్గజాల పోటీని తట్టుకుని మార్కెట్లో నిలబడటం కష్టమే. తన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ‘ఎస్ఆర్కే+’ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి...

Updated Date - 2022-03-16T00:41:13+05:30 IST