Cobra కు Srinidhi Shetty రెండింతలు రెమ్యూనరేషన్ తీసుకుందా..?

ABN , First Publish Date - 2022-07-13T20:44:21+05:30 IST

‘కెజియఫ్’ (KGF)తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అందాల భామ శ్రీ‌నిధి శెట్టి (Srinidhi Shetty). ఈ సినిమాలో రీనా పాత్రలో కనిపించింది. ఆమె పాత్రకు అభిమానుల మన్ననలతో

Cobra కు Srinidhi Shetty రెండింతలు రెమ్యూనరేషన్ తీసుకుందా..?

‘కెజియఫ్’ (KGF)తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అందాల భామ శ్రీ‌నిధి శెట్టి (Srinidhi Shetty). ఈ సినిమాలో రీనా పాత్రలో కనిపించింది. ఆమె పాత్రకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా శ్రీనిధి కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. చియాన్ విక్రమ్ (Chiyaan Vikram)కు జోడీగా ‘కోబ్రా’ (Cobra)లో నటిస్తుంది. ఆమె ఈ సినిమా చేసేందుకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ‘కెజియఫ్’ కంటే రెండింతలు పారితోషికం తీసుకుందని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


‘కెజియఫ్: చాప్టర్-2’ లో నటించేందుకు శ్రీనిధి శెట్టి రూ. 3కోట్లను పారితోషికంగా అందుకుంది. ‘కోబ్రా’ లో నటించేందుకు రూ. 6కోట్ల నుంచి రూ. 7కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ‘కోబ్రా’ కు అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వం వహించాడు. ఏఆర్. రెహమాన్ (AR Rahman) సంగీతం అందించాడు. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, మృణాళిని రవి, పద్మప్రియ, కనిక, కేఎస్.రవికుమార్, బాబు ఆంటోనీ, ఆనంద్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‌కు చెందిన లలిత్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించడంతో పాటు దాదాపుగా 20రకాల విభిన్న గెటప్పులతో సందడి చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ను మార్చి 2020లో రష్యాలో చిత్రీకరించాలనుకున్నారు. 15రోజుల షెడ్యూల్ కోసం ఆ దేశానికి వెళ్లారు. ఆ సమయంలోనే కరోనా వచ్చింది. దీంతో చిత్ర బృందం షూటింగ్‌ను రద్దు చేసుకుని అనివార్యంగా ఇండియాకు వచ్చింది.

Updated Date - 2022-07-13T20:44:21+05:30 IST