Srinidhi Shetty : పారితోషికం భారీగా పెంచేసిందా?

ABN , First Publish Date - 2022-05-31T20:06:15+05:30 IST

ఇండస్ట్రీలో పది ఫ్లాపులు అందుకున్న అగ్ర తారల కన్నా ఒక పెద్ద హిట్టొచ్చిన సాధారణ స్టార్‌కు వేల్యూ ఎక్కువుంటుంది. దానికి అత్యుత్తమ ఉదాహరణ ‘కేజీఎఫ్’ (KGF) సుందరి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) . తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న అమ్మడు.. దాని రెండో భాగంతో కూడా అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది.

Srinidhi Shetty : పారితోషికం భారీగా పెంచేసిందా?

ఇండస్ట్రీలో పది ఫ్లాపులు అందుకున్న అగ్ర తారల కన్నా ఒక పెద్ద హిట్టొచ్చిన సాధారణ స్టార్‌కు వేల్యూ ఎక్కువుంటుంది. దానికి అత్యుత్తమ ఉదాహరణ ‘కేజీఎఫ్’ (KGF) సుందరి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) . తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న అమ్మడు..  దాని రెండో భాగంతో కూడా అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. దాంతో ప్రస్తుతం ఆమె ఆఫర్ల వెల్లువలో తడిసి ముద్దవుతోంది. ఏకంగా రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్న ఆమెకు తదుపరిగా రెండు పెద్ద చిత్రాల్లో  అవకాశాలు వచ్చాయని వినికిడి. సినిమాల్ని ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులేస్తున్న శ్రీనిధి శెట్టి.. ఈ రెండు చిత్రాల కోసం తన పారితోషికాన్ని భారీగా పెంచేసేసిందని వార్తలొస్తున్నాయి. 


ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్స్ అందుకుంటున్న పారితోషికానికి సమానంగా శ్రీనిధి ఆ రెండు సినిమాలకూ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.  ‘కేజీఎఫ్’ క్రేజ్‌తో ఆమెను కథానాయికగా ఎంపిక చేసుకొన్న దర్శక నిర్మాతలు.. ఆమె అడిగినంతా ముట్టచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టాక్. కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించి.. స్టార్ హీరోయిన్స్ తో సమానంగా పారితోషికాన్ని అందుకోవడం గొప్ప విషయమే.  ఇటీవల ‘కేజీఎఫ్ 2’ (KGF 2) సక్సెస్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టిని.. మీకు పేరు కావాలా? డబ్బు కావాలా?  అని యాంకర్ ప్రశ్నించింది. దానికి శ్రీనిధి నిర్మొహమాటంగా తనకు డబ్బే కావాలని ఠక్కున సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరికొద్ది రోజుల్లో శ్రీనిధి కొత్త చిత్రం ప్రకటన రావచ్చని సమాచారం. 

Updated Date - 2022-05-31T20:06:15+05:30 IST