SSMB28 : ‘పెళ్ళిసందడి’ బ్యూటీ కూడా నటిస్తోందా?

ABN , First Publish Date - 2022-04-25T14:19:09+05:30 IST

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలోని మూడో చిత్రం ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. SSMB28 గా పిలుచుకుంటోన్న ఈ సినిమాకి త్వరలోనే మంచి క్యాచీ టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. ‘సర్కారువారి పాట’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల మహేశ్ - త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఇప్పటివరకూ లేటయింది. ఇటీవల ‘సర్కారువారి పాట’ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవడంతో SSMB28 కి ఇప్పుడు రూట్ క్లియర్ అయింది.

SSMB28 : ‘పెళ్ళిసందడి’ బ్యూటీ కూడా నటిస్తోందా?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలోని మూడో చిత్రం ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. SSMB28 గా పిలుచుకుంటోన్న ఈ సినిమాకి త్వరలోనే మంచి క్యాచీ టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. ‘సర్కారువారి పాట’ చిత్రం షూటింగ్‌ కారణంగా మహేశ్ - త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఇప్పటివరకూ లేటయింది. ఇటీవల ‘సర్కారువారి పాట’ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవడంతో SSMB28 కి ఇప్పుడు రూట్ క్లియర్ అయింది. అతి త్వరలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు ‘అతడు, ఖలేజా’ లాంటి చిత్రాలతో అభిమానుల్ని అలరించిన నేపథ్యంలో SSMB 28 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మహేశ్ బాబు సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మరో గ్లామరస్ బ్యూటికి కూడా స్పేస్ ఉండడంతో దర్శకుడు త్రివిక్రమ్ ‘పెళ్ళిసందడి’ సుందరి శ్రీలీలని సంప్రదించారట. 


ముందుగా ఈ సినిమాలో నటించడానికి శ్రీలీల ఆసక్తి చూపించలేదట. త్రివిక్రమ్.. సినిమాలోని ఆమె పాత్రని, కొన్ని సన్నివేశాల్ని వివరించడంతో శ్రీలీల చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేశ్, శ్రీలీలపై ఓ అదిరిపోయే డ్యూయెట్ ను కూడా ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త మేకోవర్ తో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేయబోతున్నారట. అలాగే మహేశ్ పాత్ర కూడా నెవర్ బిఫోర్ స్థాయిలో ఉండబోతున్నట్టు సమాచారం. తమన్ సంగీతం అందిస్తుండగా.. మహేశ్ తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-04-25T14:19:09+05:30 IST