Srikanth: తొలి తమిళ సినిమా ఏదంటే!

ABN , First Publish Date - 2022-08-20T20:30:41+05:30 IST

తెలుగు యాక్టర్‌ శ్రీకాంత్‌ తమిళ్‌ సినిమా ఇండస్ర్టీలోకి అడుగుపెడుతున్నాడు ఒక పెద్ద ప్రాజెక్ట్‌తో. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ నటిస్తున్న సినిమాలో శ్రీకాంత్‌ ఒక ముఖ్యమైన రోల్‌ చేస్తున్నారు. ఇది తన మొదటి తమిళ చిత్రమని, ఇందులో విజయ్‌కి సోదరుడిగా నటిస్తున్నట్టు చెప్పారు.

Srikanth: తొలి తమిళ సినిమా ఏదంటే!

తెలుగు యాక్టర్‌ శ్రీకాంత్‌ (Srikanth)తమిళ్‌ సినిమా ఇండస్ర్టీలోకి అడుగుపెడుతున్నాడు ఒక పెద్ద ప్రాజెక్ట్‌తో. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ నటిస్తున్న సినిమాలో శ్రీకాంత్‌ ఒక ముఖ్యమైన రోల్‌ చేస్తున్నారు. ఇది తన మొదటి తమిళ చిత్రమని, ఇందులో విజయ్‌(Vijay)కి సోదరుడిగా నటిస్తున్నట్టు చెప్పారు. ఇద్దరి మధ్య మంచి ఎమోషనల్‌ సీన్స్‌ వుంటాయని అంటున్నారు. శ్రీకాంత్‌కిది తొలి తమిళ సినిమా అయినా అందరు తెలుగు యాక్టర్స్‌తో పనిచేస్తున్నాని చెప్పారు.  రష్మిక మందన్న కథానాయిక కాగా, జయసుధ, ప్రకాష్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, సంగీత అందరూ తెలుగు సినిమాల్లో చేసిన వాళ్ళు కావటంతో తనకి అంతగా ఇబ్బంది లేదని తెలిపారు. పైగా, ఈ సినిమా దర్శకుడు  వంశీ పైడిపల్లి తెలుగు దర్శకుడు కావడం, దానికి తోడు నిర్మాత దిల్‌ రాజు కావడం వల్ల తెలుగు సినిమా వాతావరణమే కనిపిస్తుందని శ్రీకాంత్‌ అన్నారు.. కానీ ఇదే సినిమా తమిళంలో కూడా ఏకకాలంలో చిత్రీకరణ జరపడంతో తనకిది తొలి తమిళ సినిమా అని చెప్పారు. తనకి తమిళం అర్థం అవుతుందని, కానీ మాట్లాడటం సరిగ్గా రాదనీ శ్రీకాంత్‌ అన్నారు. (Srikanth as vijays brother)


Updated Date - 2022-08-20T20:30:41+05:30 IST