Biggboss 6: ట్రాక్‌ ఒకరితో.. రొమాన్స్‌ మరొకరితో..!

ABN , First Publish Date - 2022-10-05T02:35:14+05:30 IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో అయిదో వారం టాస్క్‌, నామినేషన్స్‌ మొదలైయ్యాయి. లవ్‌బర్డ్స్‌గా ఇంట్లో ఉంటున్న శ్రీసత్య–అర్జున్‌ కల్యాణ్‌ జంటగా నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. ఒకరిని ఒకరు నామినేట్‌ చేసుకునే తీరులో శ్రీసత్యది పై చేయిగా నిలిచింది.

Biggboss 6: ట్రాక్‌ ఒకరితో.. రొమాన్స్‌ మరొకరితో..!

బిగ్‌బాస్‌ హౌస్‌(Biggboss 6)లో అయిదో వారం టాస్క్‌, నామినేషన్స్‌ మొదలైయ్యాయి. లవ్‌బర్డ్స్‌గా ఇంట్లో ఉంటున్న శ్రీసత్య(Sri satya)–అర్జున్‌ కల్యాణ్‌ (Arjun kalyan)జంటగా నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. ఒకరిని ఒకరు నామినేట్‌ చేసుకునే తీరులో శ్రీసత్యది పై చేయిగా నిలిచింది. సత్యను గెలిపించడానికి, సేవ్‌ చేయడానికి బాడీగార్డ్‌లా పని చేసిన అర్జున్‌.. నిజంగానే బాడీగార్డ్‌లా మారినట్లు కనపిస్తోంది. గతవారం శ్రీ సత్య కోసం ఉన్నదంతా పోగొట్టుకుని రెండోసారి జైలుకి వెళ్లాడు. ఈవారం నామినేషన్స్‌లో శ్రీ సత్య కొట్టిన దెబ్బకి తలకిందులైపోయాడు. అందరి సమక్షంలో అర్జున్‌ని బిస్కెట్‌రాజాని చేసేసింది. అయినా అతనిలో ఎలాంటి మార్పు లేదు. దులిపేసుకుని మళ్లీ ఆమె వెంటే పడుతున్నాడు. సత్యను సేవ్‌ చేయడానికే త్యాగాలు చేస్తున్నారు. గత వారం నాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి నిరూపించుకుంటా అన్న కల్యాణ్‌ మళ్లీ నామినేషన్‌లో ఇరుక్కున్నాడు. ఈవారం శ్రీ సత్య కోసం మరోసారి త్యాగం చేసి నామినేషన్‌లో కూర్చున్నాడు. శ్రీసత్య కోసం దేనికైనా రెడీ అనే ఈ కుర్రాడిని మరోసారి డస్ట్‌ బిన్‌లో వేసేసింది. తను డబ్బు కోసమే బిగ్‌బాస్‌కి వచ్చాననీ, నీకు మనీతో పెద్దగా పనిలేదు కాబట్టి.. నువ్వు నామినేట్‌ కావాల్సిన అవసరం లేదని కల్యాణ్‌ను ఉద్దేశించి చెప్పింది. ‘‘పైగా అందరూ నా గురించి నువ్వు ఆట సరిగా ఆడడం లేదని అనుకుంటున్నారు. ఆ నింద నాకోద్దు. నేను ఒక్కవారం హౌస్‌లో ఉన్నా నాకు డబ్బులొస్తాయి. అందుకే వారం రోజుల్ని కూడా నేను వదులుకోను. అందుకే నామినేట్‌ కాకూడదని కోరుకుంటున్నా’’ అని శ్రీసత్య చెప్పగా, అర్జున్‌ ఓ నిమిషం ఆలోచించి నేను నామినేట్‌ అవుతా... నేనేంటో ఆడి నిరూపించుకుంటా’ అని శపథం చేశాడు. 


ఇదిలా ఉండగా తాజా ప్రోమోను విడుదల చేశారు బిగ్‌బాస్‌. అది కూడా అర్జున్‌కు దెబ్బ కొట్టేలానే ఉంది. బిగ్‌ బాస్‌ బర్త్‌డే కావడంతో హౌస్‌ సభ్యులను ఎంటర్‌టైన్‌ చేయమని బిగ్‌బాస్‌ కోరతాడు. అయితే ఇక్కడ శ్రీసత్యకు డాన్స్‌ చేయాలని ఆదేశించారు. అయితే పక్కన పెయిర్‌ మాత్రం అర్జున్‌ కాదు. శ్రీహాన్‌కి ఆ అవకాశం దక్కింది. ఇద్దరూ కలిసి ‘ఓ సీతా..’ అనే రొమాంటిక్‌ స్టెప్పులేశారు. ఇదే ఛాన్స్‌ అనుకున్నాడో ఏమో గానీ శ్రీమాన్‌ సత్య పైకి ఎత్తేశాడు. శ్రీ సత్య కూడా ఫుల్‌ ఎంకరేజ్‌తో రొమాన్స్‌ చేసింది. వారిద్దరి రొమాంటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూసి అర్జున్‌ కళ్యాణ్‌ బాధ పడినట్లు ప్రోమోలో చూపించారు. 




Updated Date - 2022-10-05T02:35:14+05:30 IST