Ustaad: ‘ఉస్తాద్’గా యంగ్ హీరో.. మూవీ ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-26T23:15:03+05:30 IST

‘మత్తు వ‌ద‌ల‌రా (mathu vadalara), తెల్లవారితే గురువారం (thellavarithe guruvaram)’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో శ్రీసింహా కోడూరి (Sri Simha Koduri). ఈ యంగ్ హీరో నూతన చిత్రం

Ustaad: ‘ఉస్తాద్’గా యంగ్ హీరో.. మూవీ ప్రారంభం

‘మత్తు వ‌ద‌ల‌రా (mathu vadalara), తెల్లవారితే గురువారం (thellavarithe guruvaram)’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో శ్రీసింహా కోడూరి (Sri Simha Koduri). ఈ యంగ్  హీరో నూతన చిత్రం గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ‘ఉస్తాద్’ (Ustaad) పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని  ఏ. సాయి కొర్రపాటి ప్రొడ‌క్షన్, వారాహి చ‌ల‌న చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకాల‌పై ర‌జనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఫ‌ణి దీప్‌ (PhaniDeep) దర్శకుడు. 


ఈ చిత్ర ప్రారంభోత్సవ‌ కార్యక్రమానికి ప్రముఖ సీనియ‌ర్ సంగీత ద‌ర్శకుడు ఎం.ఎం.కీర‌వాణి (MM Keeravani), శ్రీవ‌ల్లి (Srivalli), నిర్మాత సాయి కొర్రపాటి (Sai Korrapati), కాల భైర‌వ‌ (Kaala Bhairava)తో పాటు దర్శకులు వెంక‌టేష్ మ‌హా (Venkatesh Maha), శ్రీనివాస్ గ‌విరెడ్డి (Srinivas Gavireddy), సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ ప‌చ్చిపులుసు (Vamsi Pachipulusu) త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ముహూర్తపు స‌న్నివేశానికి ఎం.ఎం.కీర‌వాణి క్లాప్ కొట్టగా.. ప్రముఖ ర‌చ‌యిత పురాణ పండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వర‌లోనే ప్రారంభం కానుంది. సినిమాలో నటించే హీరోయిన్ స‌హా ఇత‌ర వివ‌రాల‌ను త్వర‌లోనే ప్రక‌టిస్తామ‌ని మేక‌ర్స్ ఈ సందర్భంగా తెలియ‌జేశారు.



Updated Date - 2022-05-26T23:15:03+05:30 IST