Sreemukhi: శ్రీముఖి అందాల గోవా పిక్స్ వైరల్

ABN , First Publish Date - 2022-11-26T20:49:29+05:30 IST

శ్రీముఖి గోవా ట్రిప్ కి హాలిడే కోసం వెళ్లినట్టుంది, అక్కడ బీచ్ లో తీసుకున్న గ్లామరస్ పిక్స్ చాలా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Sreemukhi: శ్రీముఖి అందాల గోవా పిక్స్ వైరల్

ఇప్పుడున్న బుల్లితెర యాంకర్ లలో శ్రీముఖి ఎక్కువగా (Sreemukhi) సాంఘీక మాధ్యమాల్లో తన ఫోటోస్ పెడుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి మరీ గ్లామర్ ఫోటోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈమధ్య ఆమె గోవా ట్రిప్ కి హాలిడే కోసం వెళ్లినట్టుంది, అక్కడ బీచ్ లో తీసుకున్న గ్లామరస్ పిక్స్ చాలా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీటి మీద వందల కొద్దీ కామెంట్స్ చేస్తూనే వున్నారు. (Sreemukhi glamarous pictures from Goa beach is viral on social media)


కొంతమంది అయితే కవితలు కూడా పంపారు. కొందరు అయితే శ్రీముఖి ని హాయిగా పెళ్లి చేసుకొని జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతావు అని కూడా అడుగుతున్నారు నెటిజన్స్ ఈ ఫొటోస్ చూసి. మరికొంతమంది అయితే ఎన్నాళ్ళు ఇలా టీవీ లో కనపడుతూ, ఇలాంటి ఫోటోస్ అన్నీ పోస్ట్ చేస్తూ జనాలకి కనపడుతూ ఉంటావు, నీకు ఒక జీవితం ఉండాలి కదా అని కూడా అన్నారు. (Netizens comments on her photos in a different way)


శ్రీముఖి పాపులర్ యాంకర్స్ లో ఒకరుగా చలామణి అవుతున్నారు. ఆమధ్య ఒక షో లో జడ్జి ఆమె ని ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అడిగితే, తనకి తగిన వరుడు ఇంకా దొరకలేదని సమాధానం చెప్పింది. అంటే తన అభిరుచులకు తగ్గట్టుగా వున్న అబ్బాయి ఇంకా శ్రీముఖి కి తారసపడలేదు అని చెపుతోంది. శ్రీముఖి యాక్టింగ్ కూడా చేస్తుంది, చాలా సినిమాలు కూడా చేసింది. 


తెలుగు టీవీ చానెల్స్ లో ఎక్కువగా కనపడే ఫేస్ శ్రీముఖి. ఆమెని రాములమ్మ అని కూడా ఒక నిక్ నేమ్ తో పిలుస్తూ వుంటారు. తెలుగు రియాలిటీ షోస్ కి యాంకర్ గా చేస్తూ అందరితో కలిసిపోయి కడుపుబ్బా నవ్విస్తూ, చలాకీగా ఉంటే యాంకర్స్ లో శ్రీముఖి ప్రధమ స్థానం లో వుంటుందనే చెప్పాలి. ఆమెకి సాంఘీక మాధ్యమాల్లో కూడా విపరీతమయిన ఫాలోయింగ్ వుంది. 


ఈసారి ఈ గోవా ట్రిప్ తన హృదయానికి చాల దగ్గరగా వున్న ట్రిప్ అని రాసింది శ్రీముఖి. అంటే ఆమె ఒక్కర్తే వెళ్లిందా, లేక ఇంకెవరయినా ఉన్నారా, లేక మంచు శుభవార్త ఏమయినా చెపుతుందా, ఎందుకు ఆమె ఈ ట్రిప్ అంత స్పెషల్ అని పోస్ట్ చేసిందో మరి ఆమెకే తెలియాలి. 



Updated Date - 2022-11-26T20:49:29+05:30 IST