మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో శ్రీలీల..?

ABN , First Publish Date - 2022-02-16T13:25:38+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా నటించబోతుందనే ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డేను.. మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో

మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో శ్రీలీల..?

సూపర్ స్టార్ మహేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా నటించబోతుందనే ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డేను.. మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు రాబోతుంది. దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే, ఇందులో 'పెళ్లి సందD' భామ శ్రీలీలను ఓ పాత్ర కోసం తీసుకున్నారట. కానీ, త్రివిక్రమ్ సినిమాలలో ఇప్పటి వరకు సెకండ్ లీడ్ చేసిన ఏ ఒక్కరికీ అంతగా గుర్తింపు దక్కింది లేదు. ఇదే విషయంలో శ్రీలీల ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాలా వద్దా అని డైలమాలో ఉందట. ఇది తెలుసుకున్న త్రివిక్రమ్..ఆమె పాత్రను మార్చేసి ఇంపార్టెన్స్ ఉండేలా డిజైన్ చేశారట. దాంతో ఇప్పుడు మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. 'పెళ్లి సందD' సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న అమ్మడికి మాత్రం మంచి ఆఫర్సే వస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ సరసన 'ధమాకా' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల. 

Updated Date - 2022-02-16T13:25:38+05:30 IST