Shravana Bhargavi: చూసే తీరును... జీవితాన్ని మార్చుకోండి!

ABN , First Publish Date - 2022-07-24T22:18:57+05:30 IST

గాయని శ్రావణ భార్గవి(Shravana bhargavi).. అన్నమయ్య వంశస్థులు(Annamayya family), తిరుపతి వాసులతో జరిగిన వివాదానికి ముగింపు పలికారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు రచించిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ కీర్తనను(Okaparo kokapari vayayramai krithi) ఆమె ఓ వీడియోగా చిత్రీకరించగా అన్నమయ్య వారసులు అభ్యంతరం వ్యక్తం చేయడం,

Shravana Bhargavi: చూసే తీరును... జీవితాన్ని మార్చుకోండి!

గాయని శ్రావణ భార్గవి(Shravana bhargavi).. అన్నమయ్య వంశస్థులు(Annamayya family), తిరుపతి వాసులతో జరిగిన వివాదానికి ముగింపు పలికారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు రచించిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ కీర్తనను(Okaparo kokapari vayayramai krithi) ఆమె ఓ వీడియోగా చిత్రీకరించగా అన్నమయ్య వారసులు అభ్యంతరం వ్యక్తం చేయడం, తిరుమతి వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి తొలగించారు. ఈ వివాదంలో కొందరు శ్రావణ భార్గవిని విమర్శించగా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా ఆమె వాటన్నింటికీ ముగింపు పలికారు. ఆ వీడియోలో  ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ కీర్తనను తొలగించి, మరో మ్యూజిక్‌ ఇన్‌స్ర్టుమెంట్‌ను జోడించి పోస్ట్‌ చేశారు. దీనిపై ఇన్‌స్టాలో వివరణ ఇచ్చారు. (Sravana Bhargavi Removes 'Oka Pari')



‘‘నా యూట్యూబ్‌ ఛానల్‌ అభిమానులకు, సంతోషాన్ని మనశ్శాంతిని ఇస్తుంది. నా ఛానల్‌లో నెగిటివిటీకి ఛాన్సే లేదు. నేనేప్పుడు వివాదాల జోలికి వెళ్లను. వివాదాలు కొని తెచ్చుకోను. అన్నమాచార్యులు గారి మీద ఉన్న అపార గౌరవంతో ఇటీవల విడుదల చేసిన వీడియోలో ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ కీర్తనను తొలగించాను. ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే.. ఆ వీడియో చేయడం వెనుక ఎన్నో గంటల కష్టం ఉంది. అదొక అందమైన కళాఖండమని ఇప్పటికీ నమ్ముతున్నా. ఆ వీడియో మరొక ఆడియోతో నా ఛానల్‌లో కొనసాగుతుంది. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే... ‘ఎప్పుడైతే మీరు చూసే తీరు మారుతుందో అప్పుడే మార్పును కూడా చూడగలరు. దృష్టికోణం ప్రతి విషయంలోనూ ఉంటుంది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు శ్రావణ భార్గవి. (Sravana Bhargavi Removes song)






Updated Date - 2022-07-24T22:18:57+05:30 IST