Tollywood : స్పోర్ట్స్ డ్రామాలు వర్కవుట్ అవడం లేదు !

ABN , First Publish Date - 2022-08-30T16:48:23+05:30 IST

‘తమ్ముడు (Thammudu), అమ్మనాన్న తమిళ అమ్మాయి (Amma Nanna Tamil Ammay), భద్రాచలం (Bhdrachalam)’ లాంటి స్పోర్ట్స్ డ్రామాస్ టాలీవుడ్‌లో ఒకప్పుడు దుమ్మురేపేశాయి. క్రీడా నేపథ్యంతో పాటు చక్కటి ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఆ మూవీస్ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో కదిలించాయి.

Tollywood : స్పోర్ట్స్ డ్రామాలు వర్కవుట్ అవడం లేదు !

‘తమ్ముడు (Thammudu), అమ్మనాన్న తమిళ అమ్మాయి (Amma Nanna Tamil Ammay), భద్రాచలం (Bhdrachalam)’ లాంటి స్పోర్ట్స్ డ్రామాస్ టాలీవుడ్‌లో ఒకప్పుడు దుమ్మురేపేశాయి. క్రీడా నేపథ్యంతో పాటు చక్కటి ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఆ మూవీస్ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో కదిలించాయి. అయితే ఈ జెనరేషన్‌ జనానికి అలాంటి సినిమాల్ని అందించడంలో పలువురు దర్శకులు విఫలమవుతున్నారు. ఈ మధ్యకాలంలో క్రీడా నేపథ్యం కలిగిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. తాజాగా విడుదలైన ‘లైగర్’ (Liger) సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పిచ్చారో తెలిసిందే. చిత్ర బృందం ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేసినా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకి యునానిమస్‌గా ఒకే స్థాయిలో డిజాస్టర్ టాక్ వచ్చింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్  బ్యాక్ డ్రాప్ లో చిత్రం తెరకెక్కింది. కానీ సరైన స్థాయిలో కథాకథనాల్ని, దాని తగ్గ ఎమోషన్స్‌ను క్యారీ చేయడంలో పూరీ (Puri) పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.


కొన్ని నెలల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ‘గని’ (Ghani) సినిమా ఏ రేంజ్‌లో ఫ్లాప్ అయిందో తెలిసిందే. అది కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందింది. పేలవమైన కథాకథనాలు, ఆడియన్స్‌ను కదిలించే ఎమోషన్స్ లేకపోవడంతో ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. ఆ పాత్ర కోసం వరుణ్ పడ్డ కష్టమంతా వృధా అయింది. ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati) ఫస్ట్ ఎటెమ్ట్ దారుణంగా తప్పింది. నాగశౌర్య (Nagasourya) హీరోగా, సంతోష్ జాగర్లపూడి (Santhosh jagarlapudi) అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన మరో స్పోర్ట్స్ డ్రామా‘లక్ష్య’ (Lakshya). ఆర్చరీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలైంది. ఇందులోని పాత్ర కోసం నాగశౌర్య కూడా చాలా కష్టపడ్డాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. 


కీర్తిసురేశ్ (Keerthi Suresh) ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ నగేశ్ కుకునూర్ (Nagesh Kukunur) తెరకెక్కించిన మరో స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్‌లక్ సఖి’ (Good Luck Sakhi). గన్ షూటింగ్ నేపథ్యంలోని ఈ సినిమా కూడా నీరసమైన స్ర్కీ్న్ ప్లేతో బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేకపోయింది. ఈ స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఒకే ఫార్మేట్ లో తెరకెక్కించి ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి. ఒక ఆట. అందులో విజేతగా నిలవాలన్న లక్ష్యంతో హీరో.. ఒక మెంటార్.. ఇంటర్నేషనల్ పోటీల్లో ఛాంపియన్ గా నిలవడం. ఈ పరిధి దాటి ఏ దర్శకుడూ కొత్తగా ఆలోచించలేకపోతుండడంతో సినిమాలన్నీ రొటీన్ ఫీల్ ఇస్తున్నాయి. ఇకముందైనా  ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు దర్శకులు కొత్తగా ఆలోచిస్తే బెటరని పలువురు అభిప్రాయ పాడుతున్నారు.   

Updated Date - 2022-08-30T16:48:23+05:30 IST