‘నన్ను దోచేశా’రంటూ వాపోతోన్న Spider Man!

ABN , First Publish Date - 2021-11-19T16:19:13+05:30 IST

స్పైడర్ మ్యాన్‌గా తెరపై భారీ సాహసాలు చేసే హాలీవుడ్ యాక్టర్ టామ్ హాలాండ్ మీడియాని తిట్టిపోశాడు. ముఖ్యంగా, ఎప్పుడూ హాలీవుడ్ స్టార్స్ వెంటపడే పాపరాజీ జర్నలిస్టుల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టాడు.

‘నన్ను దోచేశా’రంటూ వాపోతోన్న Spider Man!

స్పైడర్ మ్యాన్‌గా తెరపై భారీ సాహసాలు చేసే హాలీవుడ్ యాక్టర్ టామ్ హాలాండ్ మీడియాని తిట్టిపోశాడు. ముఖ్యంగా, ఎప్పుడూ హాలీవుడ్ స్టార్స్ వెంటపడే పాపరాజీ జర్నలిస్టుల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టాడు. ‘‘మా ప్రైవెసీని మా నుంచీ దోచేశారు’’ అంటూ యువ నటుడు వాపోయాడు! 


బిగ్ స్క్రీన్‌పై బిగ్ అడ్వెంచర్స్ చేసే స్పైడర్ మ్యాన్‌కు కూడా రియల్ లైఫ్‌లో షాక్ తప్పలేదు. ఆయన తన గాళ్‌ఫ్రెండ్, కోస్టార్ జెండయాను కిస్ చేస్తోన్న ఫోటోలు ఈ మధ్య పబ్లిక్‌లోకి లీక్ అయ్యాయి. అందుక్కారణం పాపరాజీ మీడియానే అంటోన్న ఆయన, ‘‘ప్రైవెసీ అనేది ఇక మీద మన చేతుల్లో ఎంత మాత్రం లేదు. ఇద్దరు ప్రేమికుల మధ్య గోప్యంగా మిగిలిపోవాల్సిన ఓ మథుర క్షణం... ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూసే స్థితి వచ్చేసింది’’ అని టామ్ హాలాండ్ బాధపడ్డాడు.    

Updated Date - 2021-11-19T16:19:13+05:30 IST