‘‘మేరా యార్’’ అంటూ స్టెప్పులేసిన ఎయిర్ హోస్టెస్.. వీడియో వైరల్..

ABN , First Publish Date - 2021-12-19T00:03:12+05:30 IST

ఒక ఎయిర్ హోస్టెస్ బాలీవుడ్ పాటకు స్టెప్పులేసింది. ఆమె స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆ వీడియో నెట్టింట

‘‘మేరా యార్’’ అంటూ  స్టెప్పులేసిన ఎయిర్ హోస్టెస్.. వీడియో వైరల్..

ఒక ఎయిర్ హోస్టెస్ బాలీవుడ్ పాటకు స్టెప్పులేసింది. ఆమె స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియోను విపరీతంగా తెగ షేర్ చేస్తున్నారు.


స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమ మీనాక్షి బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తుంటుంది. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. గతంలోను ఆమె లేడీ లవ్, నవరాయి మజీ, స్లో స్లో  అనే బాలీవుడ్ సాంగ్స్‌కు చిందులేసింది. ఆ వీడియోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఆమె ధ్వని భానుశాలి పాడిన మేరా యార్ అనే పాటకు డ్యాన్స్ చేసింది. ఆగి ఉన్న ప్లైట్‌లో ఆమె చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగించింది. ఆ వీడియోను డిసెంబర్ 18న ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే దాదాపుగా 15వేలమంది నెటిజన్లు ఆ వీడియోను చూశారు.


మేరా యార్ పాటలో ధ్వని భానుశాలితో పాటు, ఆదిత్య సీల్ నటించారు. ఈ పాటకు పీయూశ్- షాజియా దర్శకత్వం వహించారు. ద్వని భానుశాలియే ఈ పాటకు సంగీతం అందించింది.



Updated Date - 2021-12-19T00:03:12+05:30 IST