The Ghost : ఖడ్గాన్ని రెడీ చేసిన ఇంటర్‌పోల్ ఆఫీసర్

ABN , First Publish Date - 2022-08-18T17:03:22+05:30 IST

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా, ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందుతోన్న స్పై అడ్వంచరస్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ ఈ మధ్యనే పూర్తయ్యింది.

The Ghost : ఖడ్గాన్ని రెడీ చేసిన ఇంటర్‌పోల్ ఆఫీసర్

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా, ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందుతోన్న స్పై అడ్వంచరస్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ ఈ మధ్యనే పూర్తయ్యింది. అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం థియేటర్స్‌లో విడుదల కాబోతోంది.  ఇందులో విక్రమ్ గాంధీ అనే ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నాగార్జున నటిస్తుండగా.. సోనాల్ చౌహాన్ ఆయన సబార్డినేట్ ప్రియగా నటిస్తోంది. ‘గరుడవేగ’ తరహాలోని ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. మన దేశానికి శత్రుదేశాల నుంచి వాటిల్లబోయే ముప్పును తప్పించడానికి ఇంటర్ పోల్ ఆఫీసర్ నాగ్ రంగంలోకి దిగుతాడు. ఇందులో కిల్లింగ్ మెషీన్‌గా నాగార్జున సాగించబోయే శత్రుసంహారం సినిమాకే హైలైట్ అంటున్నారు. 


ఇక ఈ సినిమాలో నాగార్జున చేతిలో ఒక ప్రత్యేకమైన ఖడ్గం కీలక పాత్ర పోషిస్తుందట. హాలీవుడ్ సినిమాల్లో, ప్రత్యేకించి జపాన్ మాఫియా గ్యాంగ్ చేతుల్లో ఎప్పుడూ తళతళలాడుతూ కనిపించేదే ఆ ప్రత్యేకమైన ఖడ్గం. జపనీస్ ట్రెడిషన్‌లో తమహగనే (Thamahagane) అనే ఒక ప్రత్యేకమైన ఉక్కుతో తయారు చేస్తారు. జపనీస్ భాషలో ఈ ఆయుధాన్ని కటవా అని పిలుస్తారు. ఈ ఖడ్గానికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఈ వీడియో ఇప్పుడు విడుదలైంది. 


‘తమహగనే’ అనే మెటల్‌ను బైటికి తీసి కొలిమిలో కాల్చి, సుత్తితో కొట్టి  నాగార్జున దాన్ని  పెద్ద ఖడ్గంగా మార్చే వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంది.అత్యంత ఖరీదైన ఖడ్గంగా దానికి పేరు. అలాగే దానికి పదును కూడా ఎక్కువే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నెలకొంది. అలాగే. ఔట్ పుట్ పై  నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. మరి ‘ది ఘోస్ట్’ గా నాగార్జున ఏ స్థాయి హిట్టందుకుంటారో చూడాలి.



Updated Date - 2022-08-18T17:03:22+05:30 IST