విదేశాలకు వెళ్లేందుకు Rhea Chakraborty కి అనుమతి

ABN , First Publish Date - 2022-06-01T23:34:52+05:30 IST

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్(Sushant Singh Rajput) మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty). ఈ కేసులో భాగంగా పోలీసులు 2020 సెప్టెంబర్‌లో

విదేశాలకు వెళ్లేందుకు Rhea Chakraborty కి అనుమతి

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్(Sushant Singh Rajput) మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty). ఈ కేసులో భాగంగా పోలీసులు 2020 సెప్టెంబర్‌లో ఆమెను అరెస్టు చేశారు. దీంతో నెల రోజుల పాటు జైలులో ఉంది. అనంతరం బాంబే హైకోర్టు మెట్లెక్కి షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకుంది. అప్పుడు కోర్టు రియాకు బెయిల్ మంజూరు చేస్తూ విదేశాలకు ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఆమె పాస్‌పోర్టును ఎన్‌సీబీ ముందు సరెండర్ చేయాలని కోరింది. తాజాగా రియాకు ఐఫా ఫంక్షన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. అందువల్ల విదేశాలకు వెళ్లడానికీ అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రత్యే కోర్టు ముందు ఆమె పిటిషన్ వేసింది. రియా పిటిషన్‌ను విచారణ జరిపిన కోర్టు అందుకు అనుమతినిచ్చింది.      

  

అబుదాబీకి వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరుతూ రియా చక్రవర్తి తరఫున మనీశ్ షిండే ప్రత్యేక కోర్టుకు వాదనలు వినిపించారు. ‘‘రియాకు ఐఫా అవార్డ్స్‌లో వేడుకలో పాల్గొనే అవకాశం వచ్చింది. నిర్వహకులు గ్రీన్ కార్పెట్‌పై ఆమెను నడవాలని కోరారు. అవార్డ్ అందజేయాలన్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఇటువంటి అవకాశాలు కీలకమైనవి. డ్రగ్స్ కేసుతో రియాకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి’’ అని మనీశ్ షిండే తెలిపారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం అబుదాబీకి వెళ్లేందుకు రియాకు అనుమతినిచ్చింది. కానీ, కొన్ని షరతులు విధించింది. అబుదాబీకి వెళ్లిన అనంతరం ఇండియన్ ఎంబసీలో రియా ప్రతిరోజు హాజరు కావాలని చెప్పారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన అనంతరం పాస్‌పోర్టును ఎన్‌సీబీ‌కీ సరెండర్ చేయాలని కోరారు. కోర్టు రిజిస్ట్రీ ముందు అదనంగా రూ. లక్ష డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో రియా సోదరుడు షోయిక్ చక్రవర్తి కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-06-01T23:34:52+05:30 IST