Spark 1.O: ప్రచారం చిత్రం వదిలిన ఫ్రెండ్లీ స్టార్

ABN , First Publish Date - 2022-07-20T23:43:54+05:30 IST

ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ (Arunodaya Film Works) పతాకంపై యువ దర్శకుడు సురేష్ మాపుర్ (Suresh Mapur) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్పార్క్ 1.ఓ’ (Spark 1.O). ఆద్యంతం..

Spark 1.O: ప్రచారం చిత్రం వదిలిన ఫ్రెండ్లీ స్టార్

ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ (Arunodaya Film Works) పతాకంపై యువ దర్శకుడు సురేష్ మాపుర్ (Suresh Mapur) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్పార్క్ 1.ఓ’ (Spark 1.O). ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా.. సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్‌టైనర్ ప్రచార చిత్రాన్ని  ఫ్రెండ్లీ స్టార్ హీరో శ్రీకాంత్ (Srikanth) విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హితేంద్ర (Hitendra) నటించి, నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, దర్శకుడు సురేష్‌లో మంచి స్పార్క్ ఉందని శ్రీకాంత్ ప్రశంసించారు. 


ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించడమే కాకుండా నిర్మించిన హితేంద్ర మాట్లాడుతూ.. తమ అభ్యర్థనను మన్నించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన హీరో శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇద్దరు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి గోపి (అమితాబ్) కెమెరా, అనిల్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.



Updated Date - 2022-07-20T23:43:54+05:30 IST