Nayanthara కు ఎంత ఆస్తి ఉందో తెలుసా..? ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందంటే..

ABN , First Publish Date - 2022-06-09T16:29:36+05:30 IST

దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో నటిగా ఓ వెలుగు వెలుగుతూ, లేడీ సూపర్‌స్టార్ పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ నయన తార...

Nayanthara కు ఎంత ఆస్తి ఉందో తెలుసా..? ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందంటే..

దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో నటిగా ఓ వెలుగు వెలుగుతూ, లేడీ సూపర్‌స్టార్ పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ నయన తార. 2003లో మలయాళ చిత్రం ‘మనసింకరే’తో సినీ కెరీర్‌ని ప్రారంభించిన ఈ బ్యూటీ అనంతరం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 75 చిత్రాల్లో నటించింది. జూన్ 9న ఈ నయనతార, సినీ దర్శకుడు విఘ్నేష్ విజన్ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నయనతార గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..


బెంగళూరులో ఓ క్రిస్టియన్ కుటుంబంలో నయనతార జన్మించింది. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అనంతరం ఆ కుటుంబం కేరళలో సెటిల్ అయ్యింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పాఠశాల చదువు పూర్తి చేసిన ఈ బ్యూటీ.. కేరళలో కళాశాల చదువు పూర్తి చేసింది. కాలేజ్‌లో ఉన్నప్పుడే మలయాళ చిత్రం మనసింకరేలో తొలిసారిగా నటించింది. అయ్యా (2005)తో తమిళ చిత్రసీమకి, లక్ష్మి (2006)తో టాలీవుడ్‌కి పరిచయం అయింది. సినిమాలకి రాక ముందు ఈ బ్యూటీ ఛార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంది. కానీ సినిమాల్లో అడుగుపెట్టిన తర్వాత సీఏ చేయాలనే కలను వదులుకుంది.


సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కొద్దికాలంలోనే నయనతార నటిగా మంచి గుర్తింపు సాధించింది. వరుసగా స్టార్ హీరోల మూవీస్ చేస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. దీంతో నయనతార ఒక్కో సినిమాకి దాదాపు రూ.3 కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకుంటుందని సమాచారం. అంతేకాకుండా.. ఈ బ్యూటీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.171 కోట్లపై మాటే. 2018లో అయితే ఏకంగా రూ.15.17 కోట్ల సంపాదనతో ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్‌లో చోటు సాధించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో నిలిచిన మొదటి మహిళా నటి నయనతారే కావడం ఇక్కడ విశేషం.

Updated Date - 2022-06-09T16:29:36+05:30 IST