లతా మంగేష్కర్‌‌కు సుశీలమ్మ ఘన నివాళి

ABN , First Publish Date - 2022-02-08T03:18:46+05:30 IST

భారత చలనచిత్ర సంగీత మేరునగ శిఖరం లతా మంగేష్కర్ మృతికి ప్రముఖులెందరో నివాళులు అర్పించారు. లతాజీకి సౌత్ ఇండియన్ నైటింగేల్‌ పి. సుశీలమ్మ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో లతాజీ‌తో తనకున్న అనుభవాలను తెలిపిన

లతా మంగేష్కర్‌‌కు సుశీలమ్మ ఘన నివాళి

భారత చలనచిత్ర సంగీత మేరునగ శిఖరం లతా మంగేష్కర్ మృతికి ప్రముఖులెందరో నివాళులు అర్పించారు. లతాజీకి సౌత్ ఇండియన్ నైటింగేల్‌ పి. సుశీలమ్మ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో లతాజీ‌తో తనకున్న అనుభవాలను తెలిపిన సుశీలమ్మ.. ఆమె లేకపోవడంతో తనకు కూడా ధైర్యం కోల్పోయినట్లుగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా లతాజీకి ఎంతో పేరు తెచ్చిన పాటలను సుశీలమ్మ పాడి వినిపించారు.

   

‘‘నమస్కారం.. అందరూ లత, లత.. లత అంటారు. నేను మాత్రం లతాజీకి సోదరిని. ఆవిడ హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం నేను వెళ్లి ఆవిడకి సేవ చేసేదానిని. అందరూ నన్ను తిట్టేవారు.. నువ్వు పెద్ద గాయనివి.. వెళ్లి ఆమెకు సేవలు చేస్తున్నావేంటి? అని. అలాంటిదెప్పుడు నా మనసులో లేదు. ఆవిడ వల్ల నేను ఇంత పేరు సంపాదించుకున్నాను. ‘అల్లా తేరోనాం.. ఈశ్వర్’, ‘ఈశ్వరూ.. సత్యహే’ ఈ రెండు పాటలు నేను ప్రతి స్టేజ్ మీద పాడతాను. ఆవిడకి ఈ రెండు పాటలు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాయి. అనుకోవడానికి ఏం లేదు.. ఆమె లేదంటే నా మనసులో పెద్ద గొయ్యి పడినట్లు అయిపోయింది. ఆవిడ పాటలు పాడాలన్నా.. నాకు కూడా వయసు అయిపోయింది. ఆవిడ నూరేళ్లు బతికి ఉంటే ఎంతో చక్కగా ఉండేది. ఒక గొప్ప సింగర్ మనకి ఉంది అని ధైర్యం ఉండేది. ఆ ధైర్యం ఇప్పుడు పోయింది. ఆవిడ సంగీతానికి ఎంతో సేవ చేశారు. భారతరత్న.. అంటే ఎప్పుడూ ఆమె రత్నంలాగే వెలగాలి. ఆవిడ మనసుకు శాంతి కలగాలని నా భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను..’’ అని సుశీలమ్మ ఈ వీడియోలో తెలిపారు. 



Updated Date - 2022-02-08T03:18:46+05:30 IST