Akshay Kumar: వెబ్‌సిరీస్‌లా ఓటీటీలో రాబోతున్న ‘సురారై పోట్రు’ హిందీ రిమేక్..? మేకర్స్ ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2022-08-29T15:58:26+05:30 IST

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారీటీ ఉన్న నటుడు సూర్య. ఆయన నటించిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా)

Akshay Kumar: వెబ్‌సిరీస్‌లా ఓటీటీలో రాబోతున్న ‘సురారై పోట్రు’ హిందీ రిమేక్..? మేకర్స్ ఏమంటున్నారంటే..

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారీటీ ఉన్న నటుడు సూర్య(Suriya). ఆయన నటించిన ‘సూరారై పోట్రు(Soorarai Pottru)’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఓటీటీలో విడుదలైనప్పటికీ మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. గత నెలలో ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డు‌లో ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ తరుణంలో ఈ మూవీని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) హిందీలో రీమేక్ చేస్తున్నాడు. దీనికి అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సూర్య సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది. 


ఈ సినిమా హిందీ రిమేక్ గురించి ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూ ఉంది. గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించట్లేదు. అందులో అక్షయ్ కుమార్ సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. గత రెండు సినిమాల ఫెయిల్యూర్ నెపథ్యంలో అక్షయ్ తాజా చిత్రం ‘కట్‌పుట్లీ’ డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. అలాగే.. సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలైంది. ఈ రిమేక్‌కి సూర్య కూడా ఓ నిర్మాత వ్యహహరిస్తున్నాడు. దీంతో అక్షయ్ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానున్నట్లు ఓ ప్రముఖ వెబ్‌సైట్ న్యూస్ రాసుకొచ్చింది.


అంతేకాకుండా.. ఇది వెబ్‌సిరీస్‌లాగా నాలుగు, ఐదు ఎపిసోడ్స్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారని అందులో రాసింది. అది కూడా జనవరి 26, 2023న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీనిపై తాజాగా అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ట్వీట్ చేసింది. అందులో.. ‘హలో బాక్సాఫీస్ వరల్డ్ వైడ్ దురదృష్టవశాత్తూ మీ ప్రత్యేక కథనం తప్పు. ఇందులో ఎలాంటి నిజం లేదు. మా చిత్రం నిర్మాణంలో ఉంది. వెండితెరపై విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాసేముందు వెరిఫై చేయాలని అభ్యర్థిస్తున్నాను’ అని రాసుకొచ్చింది.



Updated Date - 2022-08-29T15:58:26+05:30 IST