ప్లీజ్ సార్.. నాకో బీర్ కావాలంటూ ఓ నెటిజన్ ట్వీట్.. Sonu Sood నుంచి అదిరిపోయే రెస్పాన్స్

ABN , First Publish Date - 2022-04-09T23:01:38+05:30 IST

కరోనా లాక్‌డౌన్ సమయంలో నిరంతరాయంగా సేవలు అందించి ఎంతో మందికి అండగా నిలిచిన బాలీవుడ్

ప్లీజ్ సార్.. నాకో బీర్ కావాలంటూ ఓ నెటిజన్ ట్వీట్.. Sonu Sood నుంచి అదిరిపోయే రెస్పాన్స్

కరోనా లాక్‌డౌన్ సమయంలో నిరంతరాయంగా సేవలు అందించి ఎంతో మందికి అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కోవిడ్ విలయతాండం చేసినప్పుడు తనకు చేతనైనంత సహాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఓ అభిమాని నుంచి సోనూ సూద్‌కు రిక్వెస్ట్ అందింది. అది విని అతడు అవాక్కయ్యాడు. అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ కూడా ఇచ్చాడు.  


సోనూ సూద్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు. ‘‘చలికాలంలో దుప్పట్టను పంచారు, వేసవిలో చల్లని బీరు అందిస్తే బాగుంటుంది’’ అని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో మెసేజ్ షేర్ చేశాడు. సోనూ సూద్‌ను స్పందించమని కోరాడు. అందుకు రియల్ హీరో అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చాడు. ‘బీర్‌తో పాటు స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది’’ అంటూ సోనూ సూద్ ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చాడు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో అడిగినవారికి లేదనకుండా సోనూ సూద్ సహాయం అందించాడు. తనకు వీలైనంత మేర ఆదుకున్నాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సోనూ సూద్ ఎమ్‌టీవీ ‘రోడీస్’ 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహారిస్తున్నాడు.



Updated Date - 2022-04-09T23:01:38+05:30 IST