పార్టీకి సిద్ధంగా ఉండు ‘పుష్ప’: సోనూసూద్

ABN , First Publish Date - 2021-12-16T19:18:16+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న

పార్టీకి సిద్ధంగా ఉండు ‘పుష్ప’: సోనూసూద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకాబోతోన్న ఈ సినిమాకు అన్ని ఇండస్ట్రీల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ వేదికగా ఈ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. పార్టీకి సిద్ధంగా ఉండాలని హీరో బన్నీని కోరారు.


‘‘బన్నీ బ్రదర్.. ‘పుష్ప’ హిందీ వెర్షన్ భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సినిమా చూసేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. సక్సెస్ పార్టీ కోసం సిద్ధంగా ఉండండి..’’ అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు బన్నీ అభిమానులు సోనూసూద్‌కు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 



Updated Date - 2021-12-16T19:18:16+05:30 IST