మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్

ABN , First Publish Date - 2022-02-09T21:16:36+05:30 IST

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తోంది. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలూ కొంతకాలం లాక్‌డౌన్ విధించాయి...

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తోంది. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలూ కొంతకాలం లాక్‌డౌన్ విధించాయి. ఆ సమయంలో నిత్యావసరాలు తప్ప మిగిలిన రంగాలు అన్ని స్థంభించిపోయాయి. అన్నింటితో పాటు రవాణా వ్యవస్థ సైతం బంద్ కావడంతో ఎంతోమంది వలస కార్మికులు కాలినడకనే తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఆ తరుణంలో అలాంటి నిస్సహాయులకు సహాయం చేసిన సోనూ సూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. అనంతరం కూడా ఎంతోమంది పేదవారికీ ఆయన సహాయం చేశారు. ఈ నటుడు తాజాగా మరోసారి తనలోని మానవత్వాన్ని నిరూపించాడు.


పంజాబ్‌లోని మోగా ప్రాంతంలో ఫిబ్రవరి 7న ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో 19 ఏళ్ల కుర్రాడు ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న సోనూ అది చూసి అపస్మారక స్థితిలో ఉన్న ఆ కుర్రాడిని రక్షించాడు. అయితే యాక్సిడెంట్‌కి  గురైన ఆ కారుకి సెంట్రల్ లాక్ ఉండడంతో అతన్ని బయటికి తీయడం కొంచెం కష్టమయ్యింది. కానీ కష్టపడి బాధితున్ని బయటికి తీసిన ఈ నటుడు అతన్ని వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కి తరలించాడు. దీంతో సరైన సమయానికి వైద్యం అందడంతో ఆ కుర్రాడు కోలుకుంటున్నాడు.

Updated Date - 2022-02-09T21:16:36+05:30 IST