‘ఆచార్య’ తెర ముందు... Sonu Sood అభిమానుల మెగా జోష్!

ABN , First Publish Date - 2022-05-01T01:55:17+05:30 IST

మెగా మూవీ ‘ఆచార్య‘లో విలన్ గా కనిపించాడు సోనూ సూద్. నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు తెలుగు తెరపై సోనూకు కొత్త కాకున్నా... ఆయన పట్ల అభిమానుల తీరు మాత్రం కరోనా కాలంలో పూర్తిగా మారిపోయింది. సోనూ ఇప్పుడు రియల్ హీరో అంటున్నారు కొందరు. అనటమే కాదు, ఏకంగా సినిమా హాల్లో...

‘ఆచార్య’ తెర ముందు... Sonu Sood అభిమానుల మెగా జోష్!

మెగా మూవీ ‘ఆచార్య‘లో విలన్ గా కనిపించాడు సోనూ సూద్. నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు తెలుగు తెరపై సోనూకు కొత్త కాకున్నా... ఆయన పట్ల అభిమానుల తీరు మాత్రం కరోనా కాలంలో పూర్తిగా మారిపోయింది. సోనూ ఇప్పుడు రియల్ హీరో అంటున్నారు కొందరు. అనటమే కాదు, ఏకంగా సినిమా హాల్లో తమ అభిమానం కూడా చాటుకుంటున్నారు. ‘ఆచార్య’ మూవీలో ఆయన పాత్ర ఎంట్రీ ఇచ్చే టైంలో దుమ్మురేపేశారు!


సోనూ సూద్ సొషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. అందులో ‘ఆచార్య’ సినిమా చూస్తోన్న ప్రేక్షకుల్లోని కొందరు సోనూ సూద్ తెరపైకి ఎంట్రీ ఇవ్వటంతోనే పెద్ద పెట్టున కేకలు వేయటం మనం చూడవచ్చు. అలాగే, కాగితలు విసిరేస్తూ వాళ్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాదు, ‘ఆచార్య’ రిలీజ్ సందర్భంగా కొంతమంది అభిమానులు సోనూ సూద్ కటౌట్ లకి కూడా తిలకం దిద్ది, బ్యాండు మోత, డ్యాన్సులతో హల్ చల్ చేశారు! అవన్నీ కూడా మనం సోనూ షేర్ చేసిన లెటెస్ట్ వీడియోలో చూడవచ్చు! 


ఫ్యాన్స్ తన పట్ల చూపిన అభిమానంతో సోనూ సూద్ భావేద్వేగానికి గురయ్యాడు. ధన్యవాదాలు చెబుతూనే... మీరంతా నా కుటుంబం అన్నాడు. అంతే కాదు, మీరు చూపుతోన్న ఇంతటి ప్రేమకి నేను అర్హుడ్ని కాదన్న ఆయన... మీరిచ్చే ప్రొత్సాహమే నేను మరింత మెరుగ్గా రాణించటానికి దోహదం చేస్తోందని వ్యాఖ్యానించాడు. 



Updated Date - 2022-05-01T01:55:17+05:30 IST