బాలీవుడ్ బ్యూటీ భర్తకు... భయంకరమైన అనుభవం...

ABN , First Publish Date - 2022-01-28T23:13:24+05:30 IST

తనకు ఎదురైన ‘భయంకరమైన అనుభవం’ అనంతరం ఒక ఈ కామర్స్ బ్రాండ్‌పై బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజా ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనమ్ కూడా ఆయన పోస్టుని రీ ట్వీట్ చేయటంతో నెటిజన్స్‌లో ఇప్పుడు చర్చ మొదలైంది...

బాలీవుడ్ బ్యూటీ భర్తకు... భయంకరమైన అనుభవం...

తనకు ఎదురైన ‘భయంకరమైన అనుభవం’ అనంతరం ఒక ఈ కామర్స్ బ్రాండ్‌పై బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజా ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనమ్ కూడా ఆయన పోస్టుని రీ ట్వీట్ చేయటంతో నెటిజన్స్‌లో ఇప్పుడు చర్చ మొదలైంది. ‘‘దారుణమైన కస్టమర్ సర్వీస్... సిగ్గుచేటు’’ అంటూ సోనమ్ కపూర్ ఘాటుగా స్పందించింది. కాగా ఇంతకు ముందు ఆమె భర్త ఓ ఈ కామర్స్ దిగ్గజంపై ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘హారిబుల్ ఎక్స్‌పీరియన్స్’ ఎదురైందంటూ ఆయన సదరు కంపెనీని ట్యాగ్ చేసి మరీ టార్గెట్ చేశారు. ఆయన ట్వీట్‌నే సోనమ్ తాజాగా రీట్వీట్ చేసింది. 



ఆనంద్ అహూజా సొషల్ మీడియా పోస్టుపై ఈ కామర్స్ సంస్థ కూడా ఇప్పటికే స్సందించింది. తమ తరుఫున జరిగిన పొరపాటుకి క్షమాపణ చెప్పింది. కంపెనీ కస్టమర్ సర్వీస్ స్పెషలిస్టులతో మాట్లాడాలని కోరింది. అయితే, దానిపై కూడా సోనమ్ భర్త ఆనంద్ అహూజా ట్విట్టర్‌లో స్సందించారు. ‘‘ఏడు రోజులకు పైగా ఈమెయిల్స్ ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నిన్న రెండు గంటల పాటూ చాట్ కూడా చేశాను...’’ అన్న ఆనంద్, కంపెనీ ప్రతినిధులు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. చూడాలి మరి, బాలీవుడ్ స్టార్ బ్యూటీ భర్తకు ఎదురవుతోన్న ఆన్‌లైన్ ఆటంకం ఎప్పటికి తీరుతుందో... 

Updated Date - 2022-01-28T23:13:24+05:30 IST