సోనమ్ కపూర్ pregnancy సోగసులు!

ABN , First Publish Date - 2022-04-18T18:57:38+05:30 IST

తాను ప్రెగ్నెంట్ అని ప్రకకటించినప్పటి నుంచీ సోనమ్ కపూర్ పేరు ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే, సాధారణంగానే ఫ్యాషన్ కు మారుపేరైన సోనమ్ గర్భవతిగా కూడా తన స్టైల్ స్టేట్మెంట్ ఏ మాత్రం మిస్ అవ్వనివ్వటం లేదు. తాజాగా మిసెస్ అహుజా...

సోనమ్ కపూర్ pregnancy సోగసులు!

తాను ప్రెగ్నెంట్ అని ప్రకకటించినప్పటి నుంచీ సోనమ్ కపూర్ పేరు ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే, సాధారణంగానే ఫ్యాషన్ కు మారుపేరైన సోనమ్ గర్భవతిగా కూడా తన స్టైల్ స్టేట్మెంట్ ఏ మాత్రం మిస్ అవ్వనివ్వటం లేదు. తాజాగా మిసెస్ అహుజా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ పిక్చర్స్ నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎంబ్రాయిడరీ సొగసులతో మెరిసిపోతోన్న సీ త్రూ బ్లాక్ కఫ్తాన్ ధరించిన గార్జియస్ బ్యూటీ ఎప్పటిలాగే ‘వావ్’ అనిపించింది!


రోజురోజుకు పెరుగుతోన్న తన బేబీ బంప్ ను సగర్వంగా ప్రదర్శించిన సోనమ్... నల్లటి లోదుస్తులపై వదులైన కఫ్తాన్ ధరించి అందమైన ఇయర్ రింగ్స్ తో చూపురుల్ని అలవోకగా ఆకట్టుకుంది. ‘‘కఫ్తాన్ లైఫ్’’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చిన అనీల్ కపూర్ తనయ... చెల్లెలు రియా కపూర్ ని కూడా ట్యాగ్ చేసింది. కేవలం సోనమ్ మాత్రమే కాదు... ఈ మధ్య కాలంలో కాజల్ అగర్వాల్, ప్రతీణ సుభాష్, సంజనా గల్రానీ వంటి ఇతర సీనియర్ హీరోయిన్స్ కూడా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ తో హల్ చల్ చేస్తున్నారు. నెటిజన్స్ లో ఈ కాబోయే మమ్మీస్ గురించిన ఇంట్రస్టింగ్ చర్చ జోరుగా సాగుతోంది...  

Updated Date - 2022-04-18T18:57:38+05:30 IST