James Bondతో Sonali Bendre... 16 ఏళ్ల కిందట ధరించిన డ్రస్సులోనే మళ్లీ ఇప్పుడు...

ABN , First Publish Date - 2022-05-07T04:41:22+05:30 IST

బాలీవుడ్ గార్జియస్ బ్యూటీ సోనాలి బెంద్రే 16 ఏళ్ల కిందటి డ్రస్ మళ్లీ వేసుకుంది! అందులో గొప్పేంటి అంటారా? ఆ డ్రస్ కి ఓ ప్రత్యేకత ఉంది. సోనాలి 16 ఏళ్ల క్రితం జేమ్స్ బాండ్ నటుడు పియర్స్ బ్రాస్నన్ తో...

James Bondతో Sonali Bendre... 16 ఏళ్ల కిందట ధరించిన డ్రస్సులోనే మళ్లీ ఇప్పుడు...

బాలీవుడ్ గార్జియస్ బ్యూటీ సోనాలి బెంద్రే 16 ఏళ్ల కిందటి డ్రస్ మళ్లీ వేసుకుంది! అందులో గొప్పేంటి అంటారా? ఆ డ్రస్ కి ఓ ప్రత్యేకత ఉంది. సోనాలి 16 ఏళ్ల క్రితం జేమ్స్ బాండ్ నటుడు పియర్స్ బ్రాస్నన్ తో ఓ ఈవెంట్ లో పాల్గొంది. అప్పుడు వేసుకున్న అందమైన సల్వార్, కమీజ్ నే మళ్లీ ఇంత కాలానికి రిపీట్ చేసింది. తాజాగా హ్యూమా ఖురేషి ఏర్పాటు చేసిన ఈద్ పార్టీలో పాల్గొన్న సోనాలి తన అలనాటి దుస్తుల్లో మెరిసిపోయింది... 


తన ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ డ్రస్ గురించి ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చిన సీనియర్ బ్యూటీ ‘‘ఈ డ్రస్ నేను 16 ఏళ్ల కిందట ధరించాను...’’ అంది. ఎన్నో ఏళ్లు గడిచిపోయినా కూడా పెద్దగా ఏం మారలేదని వ్యాఖ్యానించిన సోనాలి... ‘‘ఎంతో సంతోషంగా ఉంద’’ని అంటూ మురిసిపోయింది! 


కొంత కాలం క్రితం క్యాన్సర్ బారిన పడిన సోనాలి ట్రీట్మెంట్ తీసుకుని క్షేమంగా బయట పడింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తోన్న బీ-టౌన్ బ్యూటీ ఎక్కువగా టెలివిజన్ కే ప్రాధాన్యతనిస్తోంది. బుల్లితెర జడ్జ్ గా సోనాలి బెంద్రే బిజిబిజీగా ఉంది... 

Updated Date - 2022-05-07T04:41:22+05:30 IST