ఇలాంటి ఫొటోలు పెట్టేకంటే అలాంటి వీడియోల్లో నటించు.. బాగా డబ్బులొస్తాయ్.. Urfi Javed డ్రస్సుపై ట్రోల్స్..!

ABN , First Publish Date - 2021-12-19T22:36:51+05:30 IST

బిగ్ బాస్ ఓటీటీ బ్యూటీ ఉర్ఫీ జావేద్ మరోసారి ట్రోలింగ్‌కు గురైంది. అయినా ఇందులో కొత్తేముంది అంటారా? ఉర్ఫీ రోజుకొకసారి ట్రోల్ అవుతుంటుంది. ఆమెని నానా మాటలు అనటం ఇంటర్నెట్ రోమియోలకు కూడా అలవాటే. అయితే, తాజాగా స్లిమ్ అండ్ సెక్సీ బ్యూటీ స్విమ్ సూట్ వేసుకుని రసికులు నీళ్లు నమిలేలా చేసింది. మరీ డీప్ కట్ ఉన్న హాట్ కాస్ట్యూమ్‌లో ఉర్ఫీ బర్ఫీలా ఊరించేసింది!

ఇలాంటి ఫొటోలు పెట్టేకంటే అలాంటి వీడియోల్లో నటించు.. బాగా డబ్బులొస్తాయ్.. Urfi Javed డ్రస్సుపై ట్రోల్స్..!

బిగ్ బాస్ ఓటీటీ బ్యూటీ ఉర్ఫీ జావేద్ మరోసారి ట్రోలింగ్‌కు గురైంది. అయినా ఇందులో కొత్తేముంది అంటారా? ఉర్ఫీ రోజుకొకసారి ట్రోల్ అవుతుంటుంది. ఆమెని నానా మాటలు అనటం ఇంటర్నెట్ రోమియోలకు కూడా అలవాటే. అయితే, తాజాగా స్లిమ్ అండ్ సెక్సీ బ్యూటీ స్విమ్ సూట్ వేసుకుని రసికులు నీళ్లు నమిలేలా చేసింది. మరీ డీప్ కట్ ఉన్న హాట్ కాస్ట్యూమ్‌లో ఉర్ఫీ బర్ఫీలా ఊరించేసింది!

పలు బుల్లితెర సీరియల్స్‌లో నటించిన ఉర్ఫీ జావేద్ సొషల్ మీడియాలో రచ్చ చేయటం ఇప్పుడు కొత్తేం కాదు. ఆమె ఇంతకు ముందు చాలాసార్లు వింత వింత డ్రస్సులు వేసుకుని వివాదాలకు తెర తీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత నాటుగా కామెంట్స్ ఎదురైనా ఈ నాటీ బ్యూటీ కొత్త ఎక్స్‌పరిమెంట్స్ మాత్రం మానదు. ఆ క్రమంలోనే లెటెస్ట్‌గా మరీ సెక్సీ ఔట్‌ఫిట్ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రత్యక్షమైంది. విపరీతంగా చర్మ సౌందర్యం బయటపడటంతో నెటిజన్స్ నోళ్లు కట్టేసుకోలేపోయారు. ఒకరైతే ఏకంగా ‘‘ఇలాంటి ఫోటోలు పెట్టే బదులు ‘అలాంటి సినిమాలు’ చేయొచ్చుగా... బోలెడు డబ్బులొస్తాయి’’ అన్నారు. నిజానికి... ఉర్ఫీ కూడా సినిమాల్లో ఛాన్సుల కోసమే ఇంతలా హాట్ షో చేస్తోందని మనం భావించవచ్చు. నెటిజన్స్ అన్నట్టు ‘అలాంటి సినిమాలు’ కాకపోయినా... ఉర్ఫీ బాలీవుడ్ మెయిన్‌స్ట్రీమ్ మూవీస్ చేస్తే... అందాల్ని ఆరాధించే ప్రేక్షక భక్తులకి పండగే అని మాత్రం తడుముకోకుండా చెప్పొచ్చు!

Updated Date - 2021-12-19T22:36:51+05:30 IST