Video Viral: విలన్‌గా మారిన సైఫ్ అలీఖాన్ చెల్లెలు.. భర్తపై..

ABN , First Publish Date - 2022-04-28T18:20:40+05:30 IST

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చెల్లెలు, సోహా అలీఖాన్ కూడా పాపులర్ నటే. ఈ బ్యూటీ ప్రముఖ నటుడు కునాల్ కెమ్ముతో..

Video Viral: విలన్‌గా మారిన సైఫ్ అలీఖాన్ చెల్లెలు.. భర్తపై..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చెల్లెలు, సోహా అలీఖాన్ కూడా పాపులర్ నటే. ఈ బ్యూటీ ప్రముఖ నటుడు కునాల్ కెమ్ముతో 2009 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉండగా.. 2015లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ నటులు ఇద్దరు కూడా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా భార్యకి సంబంధించిన ఫన్నీ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో కునాల్ షేర్ చేశాడు.


కునాల్ షేర్ చేసిన ఆ వీడియోలో సోహా ముఖానికి ప్యాక్ వేసుకొని ఉంది. అంతేకాకుండా ఎడిటింగ్‌లో ఈ భామ ముఖం విచిత్రంగా కనిపించింది. చివరికి లుక్ ఇది అంటూ ఓ బీస్ట్ పిక్ పెట్టాడు. ‘జానీ దుష్మన్ బంధువు దొరికింది’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ఇది సోహా కోపానికి కారణమైందట. అందుకే రివెంజ్‌ తీర్చుకుందని మరో ఫన్నీ వీడియోని సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో కునాల్ షేర్ చేశాడు.


కునాల్ షేర్ చేసిన రెండో వీడియోలో.. సోహా ఇలా దాడి చేయగా పరిస్థితి ఇది అంటూ తన సినిమాలోని ఓ సీన్‌ని షేర్ చేశాడు. అందులో.. విలన్ ప్లేస్‌లో సోహా ఉంది. ఆమె దాడి చేయడం వల్ల కునాల్ ముఖం మొత్తం రక్తం కారుతోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి ‘పని లేని బుధవారం ఉదయం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనిపై ఎంతోమంది ఈ జంట అభిమానులు స్పందిస్తున్నారు. ‘సూపర్’, ‘పిచ్చెక్కించారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





Updated Date - 2022-04-28T18:20:40+05:30 IST