Sofia Ansari: క్రేజీ బ్యూటీ అకౌంట్ సస్పెండ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్

ABN , First Publish Date - 2022-05-14T01:47:15+05:30 IST

సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ సోఫియా అన్సారీ (Sofia Ansari). భారత్‌లో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడంతో

Sofia Ansari: క్రేజీ బ్యూటీ అకౌంట్ సస్పెండ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్

సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ ఫేమ్ సంపాదించుకున్న క్రేజీ బ్యూటీ సోఫియా అన్సారీ (Sofia Ansari). భారత్‌లో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడంతో ఇన్‌స్టాగ్రామ్‌( Instagram)లో అకౌంట్‌ను ఓపెన్ చేసింది. బోల్డ్ పిక్స్, వీడియోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో యూత్‌లో ఆమెకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె అకౌంట్‌ను దాదాపుగా 90లక్షల మంది అనుసరిస్తున్నారు. సోఫియా అభిమానులకు చేదు కబురు అందింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ సస్పెండ్ అయింది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినందుకు అకౌంట్ సస్పెండ్ అయినట్టు తెలుస్తోంది. 


సోఫియా అన్సారీ అకౌంట్ సస్పెండ్ అయిందని తెలియడంతో ఫాలోయర్స్ షాక్‌కు గురయ్యారు. ట్విట్టర్‌(Twitter)లో మీమ్స్ పెడుతున్నారు. మరికొందరు కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ‘బై బై సోదరి’ అని ఓ నెటిజన్ స్పందించాడు. ‘ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇది ఒకటి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘చాలా విచారకరమైన వార్త’ అని ఓ సోషల్ మీడియా యూజర్ కామెంట్ చేశాడు. సోఫియా అన్సారీ అకౌంట్ డిలీట్ అయినప్పటికీ ట్విట్టర్‌లో ఆమె చురుకుగా ఉంది. 


Updated Date - 2022-05-14T01:47:15+05:30 IST