Samantha: ఆ మోత బరువుల వల్లేనా.. సమంతకు సమస్యలు?

ABN , First Publish Date - 2022-09-07T21:57:46+05:30 IST

గత కొన్ని రోజుల నుండి సమంత పేరు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. ఇప్పుడు ముంబైలో ఉంటున్న సమంత (Samantha).. చర్మానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతోందన్న వార్త వైరల్‌గా..

Samantha: ఆ మోత బరువుల వల్లేనా.. సమంతకు సమస్యలు?

గత కొన్ని రోజుల నుండి సమంత పేరు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. ఇప్పుడు ముంబైలో ఉంటున్న సమంత (Samantha).. చర్మానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతోందన్న వార్త వైరల్‌గా మారింది. సమంత తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో దీని గురించి అంతగా స్పందించకపోవటం కూడా చర్చనీయాంశమైంది. రెండు వారాల క్రితం ఆమె మేనేజర్.. సమంత మూడు నెలల వరకు మీడియా ముందుకు రాదని, తన సినిమా ‘యశోద’ (Yashoda) విడుదల సమయంలో వస్తుందని చెప్పాడు. సమంత ఎక్కువగా ఇప్పుడు ముంబైలో ఉంటూ.. హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటువంటి సమయంలో ఇలాంటి వార్తలతో ఆమె వైరల్ అవడం బాధాకరమైన విషయమే. ఇంతకు ముందు కూడా సమంత ఒక చర్మ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పుడు చెన్నైలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. మళ్లీ అటువంటి సమస్యే ఆమెకు వచ్చిందా.. అనేలా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. (Skin-related problems to Samantha)


ఈ విషయంలో వినిపిస్తోన్న ఇంకో వార్త ఏమిటంటే.. సమంత ఎక్కువగా వ్యాయామం చేస్తారు.. అలా చేసిన, చేస్తున్న వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు కూడా. అందులో భాగంగానే ఆమె బరువులు ఎత్తడం కూడా చేశారు. అలా బరువులు ఎత్తడం వల్ల నడుము నొప్పి వంటివి వస్తాయని.. పలువురు ప్రముఖులు చెప్పి ఉన్నారు. సమంత పెద్ద పెద్ద బరువులు ఎత్తడం వల్ల నడుము నొప్పి ఉండవచ్చని, అందులో భాగంగానే ఆమె ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారనేలా కూడా వినిపిస్తోంది. అలా కాకపోతే.. ఆమె జిమ్ ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పెట్టేవారు, ఇప్పుడలా చేయడం లేదు. ఏదిఏమైనా, ఈ గాలి వార్తలపై సమంత క్లారిటీ ఇస్తే తప్ప.. ఇవి ఆగేలా కనిపించడం లేదు. మరి మీడియా ముందుకు ఆమె ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు క్లారిటీ ఇస్తారో..?

Updated Date - 2022-09-07T21:57:46+05:30 IST