SK20: టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది

ABN , First Publish Date - 2022-06-10T01:35:51+05:30 IST

వెర్సటైల్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా- ‘ జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి (Anudeep KV) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను

SK20: టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది

వెర్సటైల్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా- ‘ జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి (Anudeep KV) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ఫస్ట్ లుక్‌లో వైట్ అండ్ వైట్ ధరించిన శివకార్తికేయన్ చేతిలో గ్లోబ్‌తో శాంతిని ప్రభోదించే వ్యక్తిలా కనిపిస్తున్నారు. కంట్రీ మ్యాప్‌లతో పెయింట్ చేయబడ్డ చేతులు, ప్రపంచపటం, శాంతికి చిహ్నంగా ఉన్న పావురం నేపథ్యం వుండటంతో ఈ పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. శివకార్తికేయన్ చిరునవ్వులానే ఫస్ట్ లుక్ చాలా పాజిటివ్ వైబ్‌తో వుంది. ఈ చిత్రానికి ‘ప్రిన్స్’ (Prince) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాపై  ఫస్ట్ లుక్ మరింత ఆసక్తిని పెంచింది.


నారాయణ్ దాస్ నారంగ్ (Narayan Das Narang) ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని  వినాయకచవితి (Vinayaka Chavithi ) సందర్భంగా ఆగస్ట్ 31న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి (Pondicherry), బ్రిటన్‌లోని లండన్ (London) నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన మరియా ర్యాబోషప్క (Maria Ryaboshapka) కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj) కీలక పాత్రలో నటిస్తున్నారు.



Updated Date - 2022-06-10T01:35:51+05:30 IST