Sivakarthikeyan: అది నచ్చే ‘ప్రిన్స్‌’ చేయడానికి అంగీకరించాను.. ఇదో కొత్త ప్రయోగం..

ABN , First Publish Date - 2022-10-19T14:33:12+05:30 IST

తమిళ యువ నటుడు శివకార్తికేయన్‌, టాలీవుడ్‌ దర్శకుడు అనుదీప్‌ కెవీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince)..

Sivakarthikeyan: అది నచ్చే ‘ప్రిన్స్‌’ చేయడానికి అంగీకరించాను.. ఇదో కొత్త ప్రయోగం..

తమిళ యువ నటుడు శివకార్తికేయన్‌, టాలీవుడ్‌ దర్శకుడు అనుదీప్‌ కెవీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince). దీపావళి సందర్భంగా ఈ నెల 21న విడుదలకానుంది. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. అందులో.. శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) మాట్లాడుతూ.. ‘‘ప్రిన్స్‌ ఫుల్‌ ఫన్‌ మూవీ. దర్శక నిర్మాతలు టాలీవుడ్‌కు చెందిన వారు కావడంతో తెలుగు చిత్రమని అనుకుంటున్నారు. కానీ, ఇది పక్కా తమిళ చిత్రం (Tamil Movie). తెలుగులోకి డబ్‌ చేస్తున్నాం. కడలూరుకు చెందిన ఒక యువకుడు పాండిచ్చేరికి చెందిన బ్రిటిష్‌ యువతిని ప్రేమిస్తాడు. నేను సోషల్‌ టీచరుగాను, హీరోయిన్‌ మరియా ఇంగ్లీష్‌ టీచరుగా నటించాం.


మా ఇద్దరి మధ్య జరిగే కొన్ని సీరియస్‌ విషయాలను కూడా దర్శకుడు చాలా సరదాగా చెప్పారు. సరదాగా సాగినప్పటికీ హ్యుమానిటీ గురించి ఇందులో వివరిస్తాం. ఒక హ్యూమర్‌ సబ్జెక్టుతో రెండు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం కొత్త ప్రయోగం. అందుకే అంగీకరించాను. తమిళనాడుకి చెందిన క్రికెటర్‌ నటరాజన్‌ బయోపిక్‌లో నటించే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఇంకా ఖరారు కాలేదు. ‘మావీరన్‌’, ‘అయలాన్‌’ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతాయి. ఆ తర్వాత రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ చిత్రంలో నటిస్తాను. హీరో కార్తీ ‘సర్దార్‌’, ‘ప్రిన్స్‌’ చిత్రాలు వేర్వేరు జోనర్‌లో వస్తున్నాయి. రెండూ విజయం సాధించాలి’’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ మరియా (Maria), దర్శకుడు అనుదీప్‌ (Anudeep), గోపురం ఫిలిమ్స్‌ అధినేత అన్బుచెళియన్‌, నిర్మాత పుష్కర్‌ రామమోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, శాంతి టాకీస్‌ సంయుక్తంగా నిర్మించాయి.

Updated Date - 2022-10-19T14:33:12+05:30 IST