షూటింగులకు పన్ను తగ్గించండి: సీఎమ్‌ని కోరిన స్టార్ హీరో

ABN , First Publish Date - 2022-03-30T03:10:02+05:30 IST

సినిమా షూటింగులకు పన్నును రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దానిని తగ్గించాలని ఆయన కోరినట్టు సమాచారం. దీనికి అక్కడి సీఎం కూడా పరిశీలిస్తామని సమాధానం చెప్పినట్లుగా టాక్ నడుస్తుంది. కాగా..

షూటింగులకు పన్ను తగ్గించండి: సీఎమ్‌ని కోరిన స్టార్ హీరో

కోలీవుడ్‌లో ప్రముఖ హీరో శివకార్తికేయన్‌ తన 20వ చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్‌ దర్శకుడు అనుదీప్‌ డైరెక్ట్‌ చేసే ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతుంది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ కారైక్కుడిలో పూర్తిచేసుకోగా తదుపరి షెడ్యూల్‌ పుదుచ్చేరిలో జరుగుతుంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామిని హీరో శివకార్తికేయన్‌ ఇటీవల మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన ఓ విఙ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.


పుదుచ్చేరి ప్రభుత్వం సినిమా షూటింగులకు పన్నును రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దానిని తగ్గించాలని ఆయన కోరినట్టు సమాచారం. దీనికి అక్కడి సీఎం కూడా పరిశీలిస్తామని సమాధానం చెప్పినట్లుగా టాక్ నడుస్తుంది. కాగా, ఇటీవల ‘డాక్టర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్‌ మే నెలలో ‘డాన్‌’గా రానున్నారు. ఆ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఉక్రెయిన్ నటి హీరోయిన్‌గా నటిస్తోంది. 

Updated Date - 2022-03-30T03:10:02+05:30 IST