కోర్టు వివాదంలో శివకార్తికేయన్‌ చిత్రం

ABN , First Publish Date - 2021-12-26T02:09:53+05:30 IST

శివకార్తికేయన్‌ (ఎస్‌కే) హీరోగా ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘అయలాన్‌’ చిత్రం కోర్టు వివాదంలో చిక్కుకుంది. జనవరి 3న ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను జనవరి

కోర్టు వివాదంలో శివకార్తికేయన్‌ చిత్రం

శివకార్తికేయన్‌ (ఎస్‌కే) హీరోగా ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘అయలాన్‌’ చిత్రం కోర్టు వివాదంలో చిక్కుకుంది. జనవరి 3న ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదావేసింది. ఈ చిత్రాన్ని 24 ఏఎం స్టూడియో నిర్మిస్తుంది. అనేక అవాంతరాల మధ్య ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుందీ చిత్రం. అయితే, జాక్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అనే సంస్థ చిత్ర నిర్మాణ సంస్థపై మద్రాస్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ వేసింది. 


24ఏఎం నిర్మాణ సంస్థ తమ వద్ద రూ.5 కోట్ల రుణం తీసుకుందని, వడ్డీతో కలుపుకుని మొత్తం రూ.6.92 కోట్లు చెల్లించేంత వరకు ‘అయలాన్‌’ చిత్రం విడుదల చేయడం లేదా డిస్ట్రిబ్యూట్‌ చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించింది. దీన్ని విచారించిన హైకోర్టు వచ్చే మూడో తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. దీంతో ‘అయలాన్‌’ చిత్రం విడుదలకు సమస్యలు ఎదురయ్యాయి. ఇదిలావుంటే, ఏలియన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూర్చగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది.

Updated Date - 2021-12-26T02:09:53+05:30 IST