‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం తమిళ హీరో త్యాగం

ABN , First Publish Date - 2022-03-04T03:08:24+05:30 IST

ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకావాల్సి ఉంది. కానీ, అదే రోజు దర్శకుడు ఎస్‌.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలవుతోంది. దీంతో ‘డాన్‌’ విడుదల వాయిదా వేశారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం తమిళ హీరో త్యాగం

హీరో శివకార్తికేయన్‌ - దర్శకుడు శిబి చక్రవర్తి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘డాన్‌’ చిత్ర విడుదల మరోమారు వాయిదా పడింది. ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకావాల్సి ఉంది. కానీ, అదే రోజు దర్శకుడు ఎస్‌.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలవుతోంది. దీంతో ‘డాన్‌’ విడుదల వాయిదా వేశారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా వెల్లడించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ విడుదల చేస్తుంది. ‘డాన్‌’ చిత్రాన్ని కూడా ఎస్‌కే ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. దీంతో ‘డాన్‌’ చిత్రం విడుదలను మే 13వ తేదీకి వాయిదా వేశారు. 


ఇందులో శివకార్తికేయన్‌ సరసన ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ నటించగా, ఇతర పాత్రల్లో ఎస్‌జే సూర్య, సూరి, శివాంగి, ఆర్‌జే విజయ్‌ తదితరులు నటించారు. కాగా, శివకార్తికేయన్‌ గత యేడాది ‘డాక్టర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ‘డాన్‌’పై ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Updated Date - 2022-03-04T03:08:24+05:30 IST