Sitaramam trailer : రామ్ రాసిన ఉత్తరం.. సీతకై అన్వేషణ

ABN , First Publish Date - 2022-07-25T18:35:33+05:30 IST

మాలీవుడ్ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటిస్తున్న రెండో స్ట్రైట్ తెలుగు సినిమా ‘సీతారామం’ (Sitaramam). యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో, హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Sitaramam trailer : రామ్ రాసిన ఉత్తరం.. సీతకై అన్వేషణ

మాలీవుడ్ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటిస్తున్న రెండో స్ట్రైట్ తెలుగు సినిమా ‘సీతారామం’ (Sitaramam). మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) కథానాయికగా నటించింది. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో, హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్ట్ 5న ఈ సినిమా థియేటర్స్ విడుదల కాబతోంది. తెలుగు తో పాటు తమిళ, మలయాళ వెర్షన్స్ లోనూ చిత్రం విడుదల కానుంది. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ‘సీతారామం’ మూవీ ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


20 ఏళ్ళ క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకో బాధ్యత అప్పగించారు. ఈ ఉత్తరాన్ని సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’ అనే వాయిస్ పై ట్రైలర్ ఓపెన్ అవుతుంది. ఆ ఉత్తరం పట్టుకొని జర్నలిస్ట్ ఆఫ్రిన్ (రష్మికా) ప్రయాణం మొదలు పెడుతుంది. పదిరోజుల్లో ఆ ఉత్తరం సీతకు అప్పగించడమే తన లక్ష్యం. అయితే ఆ పేరుతో ఎవరూ లేరని తెలుస్తుంది. అయినా సరే సీతకోసం అన్వేషణ మొదలవుతుంది. 1965 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఎంతో హృద్యంగా ఉండబోతోందని ట్రైలర్ ను బట్టి అర్దమవుతోంది. అయితే ఈ సినిమా ఫార్మేట్.. ‘మహానటి’ (Mahanati) చిత్రం ఫార్మేట్‌ను పోలిఉందని చెప్పాలి. అందులో శంకరయ్య అనే స్లిప్ పట్టుకొని ఓ జర్నలిస్ట్ అన్వేషణ మొదలు పెట్టినట్టు.. ఇందులో ఒక ఉత్తరంతో సీతను వెతికే ప్రయత్నం చేస్తారు. అలా సీతను వెతికే ప్రయత్నంలో లెఫ్టినెంట్ రామ్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, సుమంత్ , భూమిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని చాలా భాగం కశ్మీర్ లో చిత్రీకరించారు. అలాగే.. కశ్మీర్ లోయలోని ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ లో దుల్ఖర్ సల్మాన్ లెటర్స్ పోస్ట్ చేసే సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఆ క్రమంలో చిత్ర యూనిట్ చాలా కష్టాలు పడిందని దర్శకుడు హను చెప్పాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడితే జరిగే పరిణామాల్ని.. ఈ సినిమాలో ఎంతో అందంగా చూపించబోతున్నారు. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతం అందించిన ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి. 



Updated Date - 2022-07-25T18:35:33+05:30 IST