Sitaramam : 1మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి..

ABN , First Publish Date - 2022-08-15T13:41:22+05:30 IST

మలయాళ యంగ్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman), అందాల మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) జోడీగా నటించిన ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘సీతారామం’ (Sitaramam). వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాణంలో, హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకొని, భారీ వసూళ్ళను నమోదు చేస్తోంది.

Sitaramam : 1మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి..

మలయాళ యంగ్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman), అందాల మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) జోడీగా నటించిన ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘సీతారామం’ (Sitaramam). వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాణంలో, హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకొని, భారీ వసూళ్ళను నమోదు చేస్తోంది. దుల్ఖర్ సల్మాన్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్, మృణాళ్ ఠాకూర్ సహజనటన, హను రాఘవపూడి దర్శకత్వ ప్రతిభ చిత్రానికి మంచి మైలేజ్ తెచ్చిపెట్టాయి. సినిమా విడుదలై 10 రోజులయింది. మొదటి రోజునుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో ప్రేక్షకులు చిత్రాన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇక యూఎస్‌లో అయితే ‘సీతారామం’ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 


గత రెండు నెలల్లో విడుదలైన అనేక చిత్రాలతో పోల్చితే ‘సీతారామం’ భారీగానే వసూలు చేసింది. ముఖ్యంగా యూఎస్‌ (US) లో 1 మిలియన్ డాలర్స్‌కు పైగానే కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దుల్ఖర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్‌లది మన భాష కాదు. అయినప్పటికీ.. వారి అభినయం, కథాంశంలోని కొత్తదనం, ఎమోషన్స్ ఈ సినిమాకి బలంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ.. చిత్రం ఇంకా హౌస్ ఫుల్ షోలతో నడుస్తోంది. ఈ సినిమా లాంగ్‌రన్‌లో మరింతగా వసూళ్ళను కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు. 


దర్శకుడు హను రాఘవపూడి ఇప్పటి వరకూ తీసిన చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో.. అతడి కెరీర్ డైలమాలో పడింది. అలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ కంటెంట్‌తో ‘సీతారామం’ చిత్రాన్ని తెరకెక్కించి ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. కథాంశంలో విషయం ఉంటే వసూళ్ళు వాటంతటవే వస్తాయని ‘సీతారామం’ చిత్రం మరోసారి నిరూపించింది. ఈ సినిమా తెచ్చిపెట్టిన అద్బుతమైన సక్సెస్ హనుకు మరిన్ని భారీ అవకాశాల్ని తెచ్చిపెడుతుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 



Updated Date - 2022-08-15T13:41:22+05:30 IST