Sita Ramam: ట్విట్టర్ రివ్యూ..

ABN , First Publish Date - 2022-08-05T15:05:06+05:30 IST

మహానటి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ స్టార్ హీరో దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan). ఇప్పుడు ఆయన సీతా రామం (Sita Ramam) వంటి క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Sita Ramam: ట్విట్టర్ రివ్యూ..

మహానటి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఇప్పుడు ఆయన సీతా రామం (Sita Ramam) వంటి క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు (ఆగస్టు 5) రిలీజ్ అయింది. మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) హీరోయిన్ గా..‌. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna), టాలీవుడ్ హీరో సుమంత్‌ (Sumanth) కీలక పాత్రలు పోషించారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వైజ‌యంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (Aswini Dutt) నిర్మించారు. మరి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యుద్ధంతో రాసిన ప్రేమకథ ఎలా ఉంది..? ట్వీట్టర్‌లో అభిమానుల, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది..? అనేది ఓ సారి ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..


సీతా రామం చిత్రం క్లాసిక్ రొమాంటిక్ డ్రామాగా ఉందని కొందరు ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ మధ్య కెమెస్ట్రీ చక్కగా కుదిరిందంటున్నారు. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా పాత్ర చాలా హైలెట్‌ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని.. పాటలు ఎప్పటికీ గుర్తిండిపోయాలా ఉన్నాయని తమ రివ్యూలో చెబుతున్నారు ఆడియన్స్. అలాగే, కొందరు సినిమాటోగ్రాఫీ అద్భుతంగా ఉంది.. అంటున్నారు. కచ్చితంగా సీతా రామం సినిమాను చూడాలి.. అంటూ రివ్యూలో రాశారు.  


దర్శకుడు హనురాఘవపూడి మేకింగ్ చాలా బాగుందని కొందరు ప్రశసింస్తున్నారు. సీతా రామం సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని ట్వీట్స్ పెడుతున్నారు. ఇక ఇందులో అద్భుతాఇన విజువల్స్ ఉన్నాయని చెబుతున్నారు. మరికొందరు ఈ సినిమా అంచనాలకు మించి ఉందని.. ఓ మంచి క్లాసిక్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నారు. మొత్తంగా సీతా రామం సినిమాకు ప్రేక్షకుల నుంచి, నెటిజన్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది.  







Updated Date - 2022-08-05T15:05:06+05:30 IST