Rory: హైదరాబాద్-పాకిస్థాన్.. ‘సీతా రామం’ టచ్‌..

ABN , First Publish Date - 2022-10-04T03:47:23+05:30 IST

‘భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌రూ’ ఫేమ్ చరణ్ (Charan) హీరోగా.. క‌రిష్మా హీరోయిన్‌గా చ‌ర‌ణ్ రోరి (Charan Rory) నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం..

Rory: హైదరాబాద్-పాకిస్థాన్.. ‘సీతా రామం’ టచ్‌..

‘భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌రూ’ ఫేమ్ చరణ్ (Charan) హీరోగా.. క‌రిష్మా హీరోయిన్‌గా చ‌ర‌ణ్ రోరి (Charan Rory) నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రోరి’ (Rory). సిటిఎఫ్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో చిన్నా, పెద్ద ఆర్టిస్ట్‌లెందరో నటిస్తున్నారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ యాక్ష‌క్ విజువ‌ల్స్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. ఇన్విస్టిగేష‌న్ చేసే ఇంట్ర‌స్టింగ్ పాత్రలో చ‌ర‌ణ్ ఇందులో కనిపిస్తున్నారు. గెట‌ప్ కూడా న్యాచురల్‌గా ఉంది. యాక్ష‌న్ సన్నివేశాలు హైలెట్ అనేలా ఉన్నాయి. అలాగే ఇటీవ‌ల వచ్చిన ‘సీతా రామం’ (Sita Ramam) చిత్రాన్ని షూట్ చేసిన లొకేష‌న్స్‌‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ చిత్రీకరించినట్లుగా చిత్రబృందం తెలుపుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. 


ఇక టీజర్ విడుదల సందర్భంగా చ‌ర‌ణ్ రోరి మాట్లాడుతూ.. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే.. హైద‌రాబాద్‌లో పొలిటిక‌ల్ బ్యాక్‌‌డ్రాప్‌లో జ‌రిగే కుర్రాడి క‌థ ఇది. అనుకోని పరిస్థితిల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్ వెళ్ళాల్సివస్తుంది. అక్క‌డ కొంత‌మంది హిందువుల‌ని క‌లిసి వారి క‌ష్టాలు తెలుసుకుని.. వారితో ఇండియాకి క్షేమంగా వ‌చ్చాడా? లేదా? అనేది ఈ చిత్ర క‌థ‌. అస‌లు హైద‌రాబాద్‌ (Hyderabad)కి , పాకిస్థాన్‌ (Pakistan)కి మ‌ధ్య ఉన్న సంబంధం ఏమటనేది చిత్రంలోని ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌. ఈ  చిత్ర క‌థ‌నం ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా వుంటుంది.. షూటింగ్ పూర్తయింది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్రకటిస్తాము.. అని తెలిపారు.

Updated Date - 2022-10-04T03:47:23+05:30 IST