Sita Ramam: దక్షిణాదిలో సక్సెస్‌.. ఇక ఉన్నది ఉత్తరాదే!

ABN , First Publish Date - 2022-08-29T21:32:09+05:30 IST

‘సీతారామం’.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. విడుదలై మూడు వారాలు పూర్తికావొస్తున్నా... ఈ ప్రేమ కావ్యాన్ని ప్రేక్షకులు మదిలో దాచుకున్నారు. సినీ ప్రముఖులు సైతం చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిందీ సినిమా.

Sita Ramam: దక్షిణాదిలో సక్సెస్‌.. ఇక ఉన్నది ఉత్తరాదే!

‘సీతారామం(Sitaramam)’.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. విడుదలై మూడు వారాలు పూర్తికావొస్తున్నా... ఈ ప్రేమ కావ్యాన్ని ప్రేక్షకులు మదిలో దాచుకున్నారు. సినీ ప్రముఖులు సైతం చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిందీ సినిమా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్‌ లవ్‌, రొమాంటిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని  ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై లాభాల బాటలో ఉన్న ఈ చిత్రాన్ని హిందీ ఆడియన్స్‌ ముందుకు కూడా తీసుకెళ్లబోతోంది వైజయంతీ సంస్థ (Vyjayanti movies). దక్షిణాదిలో సక్సెస్‌ పరంపర కొనసాగించిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 2న ‘సీతారామం’ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నారు. (Sita ramam in hindi on 2 september)


దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌, స్పప్నా సినిమాస్‌ సంస్థలు నిర్మించాయి. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. 






Updated Date - 2022-08-29T21:32:09+05:30 IST