Sita Ramam: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియన్ స్టార్..

ABN , First Publish Date - 2022-08-03T15:24:29+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ‘సీతారామం’ (Sita Ramam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా హాజరవబోతున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) నటిస్తున్న

Sita Ramam: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియన్ స్టార్..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ‘సీతారామం’ (Sita Ramam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా హాజరవబోతున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) నటిస్తున్న రెండవ స్ట్రైట్ తెలుగు సినిమా ఇది. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) కథానాయికగా, మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో నటించారు. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న థియేటర్స్ లో రాబోతోంది. 


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్, ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, సుమంత్ , భూమిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని చాలా భాగం కశ్మీర్ లో చిత్రీకరించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ, మలయాళ వెర్షన్స్ లోనూ విడుదల చేయబోతున్నారు. అయితే, విడుదల తేదీ దగ్గరగపడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ నిర్వహిస్తున్నారు. 


దీనిలో భాగంగా ఈరోజు నిర్వహించబోయో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియన్ స్టార్స్ ప్రభాస్ గెస్టుగా హాజరవబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు. దీనిలో నేడు రాత్రి 7 గంటల నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో    ‘సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మొదలవనున్నట్టు...దీనికి ముఖ్య అతిథిగా ప్రభాస్ విచ్చేయనున్నట్టు పేర్కొన్నారు.  భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.  



Updated Date - 2022-08-03T15:24:29+05:30 IST