Aryan Khan drugs case: ఆధారాలు లేవన్న సిట్.. స్టార్‌కిడ్‌కి నష్టపరిహారం ఏంటంటూ..

ABN , First Publish Date - 2022-03-02T16:19:57+05:30 IST

గతేడాది బాలీవుడ్ చిత్ర పరిశ్రమని కుదిపేసిన విషయాల్లో షారుక్ ఖాన్ తనయుడి డ్రగ్స్ కేసు ఒకటి. అక్టోబర్ 3న ఎన్‌సీబీ ఈ స్టార్‌కిడ్‌తోపాటు క్రూయిజ్ షిప్‌లో..

Aryan Khan drugs case: ఆధారాలు లేవన్న సిట్.. స్టార్‌కిడ్‌కి నష్టపరిహారం ఏంటంటూ..

గతేడాది బాలీవుడ్ చిత్ర పరిశ్రమని కుదిపేసిన విషయాల్లో షారుక్ ఖాన్ తనయుడి డ్రగ్స్ కేసు ఒకటి. అక్టోబర్ 3న ఎన్‌సీబీ ఈ స్టార్‌కిడ్‌తోపాటు క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే నెపంతో మరో 17 మందిని అరెస్ట్ చేసింది. దాదాపు మూడు వారాల పాటు జైలు జీవితం తర్వాత ఆర్యన్‌కి బెయిలు లభించింది. అయితే ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని కోర్టు తెలిపింది.


అనంతరం ఈ కేసు ఇన్‌వెస్టిగేషన్ చేయడానికి ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజా నివేదికల ప్రకారం.. ఎన్‌సీబీ ఆరోపణల మేరకు ఆర్యన్‌కి వ్యతిరేకంగా సిట్‌కి ఎలాంటి ఆధారాలు లభించలేదు. విచారణలో ఆర్యన్ ఖాన్ ఎప్పుడూ డ్రగ్స్ కలిగి లేడని తేలిందని అధికారులు తెలిపారు. అందువల్ల అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకొవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా.. ఎన్‌సీబీ దాడిని ఎందుకు రికార్డ్ చేయలేదనే ప్రశ్నని సిట్ లేవనెత్తింది. అయితే సిట్ దర్యాప్తు ఇంకా పూర్తి కానందున తుది నివేదికను సమర్పించడానికి ఈ బృందానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు.


కాగా.. ఈ విషయాన్ని పేపర్‌లో చూసిన ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంజయ్ గుప్తా స్పందించాడు. ఆ వార్తకు సంబంధించిన పేపర్ క్లిప్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి.. ‘చివరికీ నిజం బయటకి వచ్చింది. తర్వాత ఏంటి?. ఈ యువకుడికి జరిగిన నష్టానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు?’ అంటూ రాసుకొచ్చాడు.



Updated Date - 2022-03-02T16:19:57+05:30 IST