సిస్టర్‌ సెంటిమెంట్‌ పండింది

ABN , First Publish Date - 2022-08-13T06:17:21+05:30 IST

సినిమాల్లో సిస్టర్‌ సెంటిమెంట్‌కు తిరుగులేదు. అది ఎవర్‌ గ్రీన్‌ ఫార్ములా. చెల్లెలు కోసం అన్నయ్య చేసే సాహసాలు ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధేస్తుంటుంది.

సిస్టర్‌ సెంటిమెంట్‌ పండింది

సినిమాల్లో సిస్టర్‌ సెంటిమెంట్‌కు తిరుగులేదు. అది ఎవర్‌ గ్రీన్‌ ఫార్ములా. చెల్లెలు కోసం అన్నయ్య చేసే సాహసాలు ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధేస్తుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు తీసుకొచ్చే మంత్రం.. అది. సినిమాల్లోనే కాదు.. బయట కూడా మన సినీ తారలకు ఈ సెంటిమెంట్‌ కాస్త ఎక్కువే. రాఖీ రోజున అది ఇంకాస్త ఎక్కువగా బయటపడుతుంది.


రాఖీ పూర్ణిమ... సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక. ‘నీకు నీనున్నా..’ అనే ఽధైర్యాన్ని చెల్లెమ్మకు అందించే సందర్బానికి వేదిక. గురు, శుక్రవారాల్లో దేశవ్యాప్తంగా రాఖీ పండుగ వైభగంగా చేసుకొన్నారు. సోషల్‌ మీడియాలో అయితే సినీ సెలబ్రెటీల రాఖీలు మరింతగా మెరిశాయి. హీరోలు తమ సోదరీమణులకు, హీరోయిన్లు తమ సోదరులకు విషెష్‌ చెప్పుకొన్నారు. వాళ్లతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని చిత్రాల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఓ లుక్కేయండి. 

Updated Date - 2022-08-13T06:17:21+05:30 IST