సిరివెన్నెల రాసిన ప్రతి పాట ఆణిముత్యమే.. ఆయనకు వచ్చిన అవార్డుల వివరాలివి..!

ABN , First Publish Date - 2021-11-30T22:34:22+05:30 IST

ప్రణయ గీతాల నుంచి విప్లవ గీతాల దాకా.. ప్రకృతి నుంచి పడుచు అమ్మాయిల దాకా.. అగ్గిపుల్ల నుంచి సబ్బు బిల్ల దాకా.. దేని మీద.. ఎవరి మీదైనా పాటలు రాసి శ్రోతలను మైమరిపింప చేసే రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తి.

సిరివెన్నెల రాసిన ప్రతి పాట ఆణిముత్యమే.. ఆయనకు వచ్చిన అవార్డుల వివరాలివి..!

ప్రణయ గీతాల నుంచి విప్లవ గీతాల దాకా.. ప్రకృతి నుంచి పడుచు అమ్మాయిల దాకా.. అగ్గిపుల్ల నుంచి సబ్బు బిల్ల దాకా.. దేని మీద.. ఎవరి మీదైనా పాటలు రాసి శ్రోతలను మైమరిపింప చేసే రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తి. అలాంటి రచయిత ఇకలేరు. న్యూమోనియాతో బాధపడుతూ ఈ నెల 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఆయన మంగళవారం కన్నుముశారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చారు. ఆయన మరణానికి చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 


20 మే 1955లో పుట్టిన సిరివెన్నెల అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమాకి రాసిన పాటలతో గుర్తింపు సాధించి.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ‘సిరివెన్నెల’గా ప్రసిద్ధి చెందారు. ఆయన 2020 వరకూ దాదాపు 3000కు పైగా పాటలు రాయడమే కాకుండా.. వాటిలో పదకొండింటికి నంది అవార్డులు మరియు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించింది.


సిరివెన్నెల ఉత్తమ రచయితగా సాధించిన అవార్డులు..


నంది అవార్డులు.. పాట

1. సిరివెన్నెల (1986) – విధాత తలపున

2. శృతిలయలు (1987) – తెలవారదేమో స్వామి

3. స్వర్ణకమలం (1988) – అందెలరావమిది పదములదా

4. గాయం (1993) – సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని

5. శుభ లగ్నం (1994) – చిలక ఏ తోడు లేక

6. శ్రీకారం (1996) – మనసు కాస్త కలత పడితే

7. సింధూరం (1997) – అర్ధ శతబ్దపు అజ్ఞానాన్నే

8. ప్రేమ కథ (1999) – దేవుడు కరుణిస్తాడని

9. చక్రం (2005) – జగమంత కుటుంబం నాది

10. గమ్యం (2008) – ఎంత వరకు ఎందుకు కోరకు

11. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) - మరి అంతగా



ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు).. 

1. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)

2. గమ్యం (2008)

3. మహాత్మ (2009)

4. కంచె (2015)


సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్

ఉత్తమ గేయ రచయిత (తెలుగు) – కంచె (2015)


నిజం చెప్పాలంటే.. అవార్డు వచ్చిన రాకపోయిన ‘సిరివెన్నెల’ రాసిన ప్రతి పాట ఓ అద్భుతమే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ‘రుద్రవీణ’ సినిమాలో అన్ని పాటలు ఈయనే రాయగా.. అందులో ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని’, ‘తరలి రాద తనే వసంతం’, ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలోని ‘తెలుసా మనసా’, ‘క్షణక్షణం’లో ‘జాము రాతిరి జాబిలమ్మా’, ‘పట్టుదల’ సినిమా నుంచి ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ’ వంటి ఎన్నోపాటలు సంగీత ప్రియులని అలరించాయి. ఆయన ఎప్పుడో రాసిన పాత పాటలు అంటే ఈ తరం యువత సైతం చెవి కోసుకుంటారంటే అతిశయోక్తి లేదు. 

Updated Date - 2021-11-30T22:34:22+05:30 IST