Sirivennela: చివరి పాట ఎవరికోసమో తెలుసా?

ABN , First Publish Date - 2022-07-19T05:51:57+05:30 IST

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన తర్వాత ‘ఆయన రాసిన చివరి పాట మా సినిమాకే’ అంటూ చాలామంది ప్రచారం చేసుకున్నారు. క్లైమ్ చేసుకోవాలని చూశారు నిర్మాతలు. ఎస్‌.పి.బాలు మరణించిన సమయంలోనూ ఇదే జరిగింది. ‘బాలూగారు చివరి పాట మా సినిమాలోనే పాడారు’ అని చాలామంది చెప్పుకొచ్చారు. చివరి పాట ఒకటే ఉంటుంది కానీ.. చివరి పాటలు ఉండవు.

Sirivennela: చివరి పాట ఎవరికోసమో తెలుసా?

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela seetharama sastri)మరణించిన తర్వాత ‘ఆయన రాసిన చివరి పాట మా సినిమాకే’ అంటూ చాలామంది ప్రచారం చేసుకున్నారు. క్లైమ్ చేసుకోవాలని చూశారు నిర్మాతలు. ఎస్‌.పి.బాలు (Sp balu) మరణించిన సమయంలోనూ ఇదే జరిగింది. ‘బాలూగారు చివరి పాట మా సినిమాలోనే పాడారు’ అని చాలామంది చెప్పుకొచ్చారు. చివరి పాట ఒకటే ఉంటుంది కానీ.. చివరి పాటలు ఉండవు. బాలు, సీతారామశాస్త్రి విషయంలో ‘ఇదే చివరి పాట’ అంటూ చాలా పాటలొచ్చాయి. ఇదంతా కరోనా వల్ల షూటింగ్‌లు ఆలస్యం అయ్యి.. సమయానికి రిలీజ్‌ కాక ఎప్పుడో రాసిన పాటలు ఇప్పుడు రిలీజ్‌ కావడం వల్ల వచ్చిన సమస్య ఇది. సీతారామశాస్త్రి ‘రంగమార్తండ’లో ఓ పాట రాశారు. ‘సీతారామం’లోనూ ఆయన రాసిన పాట ఇటీవల బయటకు వచ్చింది. అయితే ఈ చిత్రాలు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేదు. అయితే సిరివెన్నెల చివరిగా రాసిన పాట ఎవరి కోసమో తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే!(Sirivennela seetharama sastri last song )


సిరివెన్నెల తన చివరి పాట సినిమా కోసం రాయలేదు. తన అర్థాంగి పద్మావతి కోసం రాశారు. ఆసుపత్రి బెడ్‌ మీద ఉన్న సిరివెన్నెల తన భార్యకు కానుకగా ఓ పాట రాశారని, ఆ పాటలోని పల్లవి మాత్రమే పూర్తయ్యిందని ఆయనకు అత్యంత సన్నిహితులైన ఒకరు వెల్లడించారు. అయితే సీతారామశాస్త్రి చివరిపాట ఇదే అని అధికారం ఆయన భార్యకు మాత్రమే ఉందన్నమాట. (Sirivennela last song for his wife)


Updated Date - 2022-07-19T05:51:57+05:30 IST